Jump to content

దెయ్యం

వికీపీడియా నుండి
దెయ్యం

దెయ్యం (Ghost) చనిపోయిన వ్యక్తిని పోలినవి. దెయ్యాలు వాటికి సంబంధించిన, చనిపోయిన ప్రదేశాలలో కనిపిస్తాయి లేదా వానికి సంబంధించిన వ్యక్తులకు కనిపిస్తాయి. దెయ్యాలు చనిపోయిన వ్యక్తుల ఆత్మలకు సంబంధించినవిగా కూడా భావిస్తారు.[1][2][3] ఇవి ఎక్కువగా కనిపించే ప్రదేశాల్ని హాంటెడ్ (Haunted) ప్రదేశాలు అంటారు. ఇవి కొన్ని వస్తువుల్ని ప్రేరేపిస్తాయి; కానీ ఇలాంటివి ఎక్కువగా యువతులలో కనిపించే మానసిక ప్రవృత్తికి సంబంధిచిన విషయాలుగా కొందరు భావిస్తారు.[4] దెయ్యపు సైన్యాలు, జంతువులు, రైళ్ళు, ఓడలు కూడా ప్రచురించబడ్డాయి.[5][6]

అయితే దెయ్యాలు ఉన్నది లేనిదీ చాలా సంధిగ్ధంగా ఉన్నాయి. ఇవి ఉన్నాయని నమ్మేవాళ్ళు, నమ్మనివాళ్ళూ ప్రపంచమంతా ఉన్నారు.[7] దెయ్యాల గురించి ప్రాచీనకాలం నుంచి నమ్మకాలు బలంగా నాటుకున్నాయి. అయితే 19వ శతాబ్దంలో మానసిక శాస్త్ర పరిశోధనలు కూడా జరిగాయి. దీనికి సంబంధించిన భూత వైద్యులు దెయ్యాల్ని వదిలించడానికి ప్రయత్నించి సఫలీకృతులయ్యారు. హేతువాదులు దెయ్యాల ఉనికిని నమ్మరు. కొన్ని కారణం తెలియని విషయాలకు దెయ్యాలుగా ప్రచారం చేస్తారని వీరు భావిస్తారు. అయితే ప్రపంచవ్యాప్తంగా రెండింటికీ కూడా బలమైన నిరుపణలు లేవు.[8] అమెరికాలో 2005 సంవత్సరంలో జరిపిన సర్వే ప్రకారం సుమారు 32% మంది దెయ్యాలు ఉన్నాయని నమ్మారు.[9]

నమ్మకాలు

[మార్చు]

హిందూ మతంలో చాలా మంది దెయ్యాలని నమ్ముతారు. కొంతమంది దెయ్యాలను నమ్మరు అలాగే దేవుడిని కూడా నమ్మరు. కొంతమంది దెయ్యాలు వుంటే దేవుడు కూడా ఉంటాడని, లేకపోతే దేవుడు వుంటే దెయ్యాలు కూడా ఉంటాయని నమ్ముతారు. సదా దేవుడు దెయ్యాల నుంచి రక్షిస్తూ ఉంటాడని నమ్ముతారు.. ఏదైనా ఒక మంచి పనిచేస్తున్నపుడు దుష్టశక్తులు అడ్డుకుంటూ ఉంటాయని నమ్ముతారు, ఇక్కడ దుష్ట శక్తులు అంటే దెయ్యాలే. అసలు ఇంతకి దెయ్యాలు ఉంటాయా అన్న ప్రశ్నకి మాత్రం ఇప్పటిదాకా కచ్చితమైన సమాధానం లేదు. ఎవైన కొన్ని వింత విషయాలు చెడ్డవి జరిగితే అది దెయ్యాల ప్రభావమేనని నమ్ముతారు. కానీ కొన్ని విషయాలను శాస్త్రవేత్తలు ప్రయోగపూర్వకంగా నిరూపించిన సంఘటనలు కూడా కొన్ని సమయాలలో చోటు చేసుకున్నాయి. కొన్ని పల్లెటూర్లలోని  ప్రజలు దయ్యం తమతో ప్రవర్తించిన తీరును చెప్తుంటారు. దేవ ఘడియలో జన్మించిన వారికి దయ్యం కనిపిస్తుందని ప్రజల్లో ఒక అభిప్రాయం ఉంది. ఎవరైనా ఆయుష్షు తీరకుండా చనిపోతే దయ్యలై తిరుగుతూ ఉంటారని నమ్ముతారు. అలాగే ఎవరైనా కోరికలు తీరకుండా చనిపోయినా కూడా వారి ఆత్మ దెయ్యం రూపంలో తిరుగుతుందని చెప్తారు కానీ హిందూ పురాణాల ప్రకారం ఎవరైనా చనిపోతే ఒక సంవత్సరం పాటు వారి ఆత్మకు శాంతి ఉండదని ఆ సంవత్సరం కాలం పాటు ఆత్మ ఘోషిస్తూ ఉంటుందని పౣడితులు చెప్తారు.

ఇస్లాం మతంలో దయ్యాలు

[మార్చు]
  • హసన్ హుసేన్ లకు దృష్టితగలకుండా దయ్యాలబారిన పడకుండా ప్రవక్త ప్రార్థించేవారు.
  • షైతాను రెండుకొమ్ముల మధ్యలో నుంచి సూర్యుడు ఉదయిస్తాడు (బుఖారీ 4:495)
  • నమాజు చేసేవాని ముందునుంచి నడిచేవాడు దయ్యంలాంటివాడు (బుఖారీ 4:495)
  • రాత్రికాగానే పిల్లల్ని దగ్గరకుతీసుకోండి.దయ్యాలు తిరుగుతుంటాయి (బుఖారీ 4:500)
  • దయ్యాలు పరలోకం నుండి భవిష్యవిషయాలను ఒకటో రెండో దొంగతనంగా విని జోతిష్కులకు చెబితే వాళ్ళు వంద అబద్దాలు వాటికి కలిపి చెబుతారు (బుఖారీ 6:324)

క్రైస్తవమతంలో దయ్యాలు

[మార్చు]

లూసిఫర్ అను దేవదూత దేవుని సన్నిదిలో వుంటూ దూతలకు అధికారిగా కూడా వుంటుంది. ఆయితే ఒక నాడు అది తనను గూర్చి గర్వపడుతుంది. దేవదూతలు దేవుని తర్వాత తనను మాత్రమే గౌరవిస్తారని అతిశయపడుతుంది. దాని దుష్ట బుద్ధిని ఎరిగిన దేవుడు ఆ దేవదూతను పాతాళమునకు తోసి వేశాడు. ఆ లూసిఫర్ సాతనుగా పిలువబడుతూ తన అనుచరులతో కలసి దేవునిబిడ్డలకు కీడు చేయుటకు భూమి తిరుగుతుంది.

  • బైబిల్ లో వీటిని అపవిత్రాత్మలు అంటారు.సాతానును లూసిఫర్, అపవాది లాంటిపేర్లతో కూడా పిలుస్తారు.
  • సేన అనే దయ్యాలగుంపు పట్టిన వాడిని యేసు బాగుచేస్తే ఆ దయ్యాలు వెళ్ళి పందులలో ప్రవేశిస్తే ఆ పందులు సరస్సులో పడి చనిపోతాయి (లూకా 8:33)
  • యేసు దయ్యాల అధిపతివలన దయ్యాలను వెళ్ళ్గొడుతున్నాడని పరిసయ్యులు ఆరోపిస్తారు (మత్తయి 9:34).
  • దయ్యలుకూడా దేవుడు ఒక్కడే అని నమ్మి వణుకుతాయి (యాకోబు 2:

మూలాలు

[మార్చు]
  1. http://www.merriamwebster.com/dictionary/ghost Merriam Webster dictionary, retrieved December 24, 2007 "a disembodied soul"
  2. http://www.parapsych.org/glossary_e_k.html#g Archived 2011-01-11 at the Wayback Machine Parapsychological Association, glossary of key words frequently used in parapsychology, Retrieved December 13 2006
  3. http://www.thefreedictionary.com/ghost Retrieved December 13 2006 "The spirit of a dead person, especially one believed to appear in bodily likeness to living persons or to haunt former habitats."
  4. Daniel Cohen (1994) Encyclopedia of Ghosts. London, Michael O' Mara Books: 137-56
  5. Christina Hole (1950) Haunted England. London, Batsford: 150-163
  6. Daniel Cohen (1994) Encyclopedia of Ghosts. London, Michael O' Mara Books: 8
  7. The Oxford Book of the Supernatural (1995) edited by D.J. Enright: 503-542
  8. Daniel Cohen (1994) Encyclopedia of Ghosts. London, Michael O' Mara Books
  9. Musella, David park (Sep 2005). "Gallup poll shows that Americans' belief in the paranormal persists". Skeptical Inquirer. Archived from the original on 2007-07-28. Retrieved 2009-01-08.
"https://te.wikipedia.org/w/index.php?title=దెయ్యం&oldid=4010792" నుండి వెలికితీశారు