జడత్వము
ఈ వ్యాసం నుండి ఇతర పేజీలకు లింకులేమీ లేవు.(అక్టోబరు 2016) |
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
ఏ బాహ్య బలం పనిచేయకపోతే నిశ్చల స్థితిలో ఉన్న వస్తువు అదే స్థితిలోనూ సమవేగంతో ఋజు మార్గంలో గమించే వస్తువు అదే గమన స్థితిలోనూ ఉండిపోయే వస్తువు ధర్మాన్ని జడత్వం అంటారు.
ఉదాహరణలు
[మార్చు]- కొన్ని కేరమ్స్ కోయిన్స్ తీసుకుని ఒకదానిపై నొకటి పేర్చి, స్ట్రైకర్ తో గట్టిగా అడుగున ఉన్న కాయిన్ ను గురి చూసి కొడితే అది మాత్రమే బయటకు వచ్చేస్తుంది. జడత్వం వల్ల మిగిలిన కాయిన్లు గల వరుస అదే విధంగా ఉండిపోతుంది.
- ఒక వెడల్పు మూతిగల సీసా తీసుకుని దానిలో యిసుక పోయవలెను. (ధృఢంగా ఉండుటకు) దాని మూతిని కార్డు బోర్డు అట్టతో మూసివేయుము. దాని మూతికి సరిగ్గా పైన ఒక గాజు గోళీని ఉంచవలెను. ఈ కార్దుబోర్డును హఠాత్తుగా లాగినపుడు జడత్వం వల్ల గాజుసీసా మూతిగుండా సీసాలో పడిపోతుంది.
రకములు
[మార్చు]- నిశ్చల జడత్వం
- గమన జడత్వం
- దిశా జడత్వం
నిర్దేశ చట్రాలు
[మార్చు]జడత్వ నిర్దేశ చట్రం
[మార్చు]ఊహాత్మక నిరూపాక్షాలను కలిగియుండి, నిశ్చలంగా గాని, సమ చలనంతో గాని ఉండి న్యూటన్ గమన నియమాలను వినియోగించడానికి వీలున్న వ్యవస్థలని జడత్వ నిర్దేశ చట్రం అంటారు
అజడత్వ నిర్దేశ చట్రం
[మార్చు]భ్రమణంలో కాని త్వరణంలో కాని ఉన్నటువంటి వస్తువుకు జోడించబడిన, న్యూటన్ గమన నియమాలు పాటించని ఊహాత్మక నిరూపక వ్యవస్థనే అజడత్వ నిర్దేశ చట్రం అంటారు.
నిశ్చల జడత్వం
[మార్చు]ఒక బస్సు నిశ్చల స్థితిలో గలదు. అందులో ప్రయాణీకులు కూడా నిశ్చల స్థితిలోనే ఉంటారు. ఇపుడు బస్సు ఒకేసారి ముందుకు కలిలితే అందులోని ప్రయాణీకులు వెనుకకు పడతారు. ఇది నిశ్చలస్థితికి సంబంధించిన జడత్వం.
గమన జడత్వం
[మార్చు]ఒక బస్సు గమనంలో ఉందని అనుకుందాం. అందులోని ప్రయాణీకులు కూడా అదే వేగంతో గమన స్థితిలో ఉంటారు. ఇపుడు బస్సు హఠాత్తుగా ఆగితే ప్రయాణీకులు ముందుకు పడతారు. ఇది గమన జడత్వానికి ఉదాహరణ.
దిశా జడత్వం
[మార్చు]ఒక బస్సులో ప్రయాణీకులు ప్రయాణిస్తున్నారు అనుకొనుము. అది హఠాత్తుగా వక్రమార్గంలో కుడి వైపుకి తిరిగినట్లైన ప్రయాణీకులు ఎడమవైపు పడతారు. ఇది దిశ జడత్వానికి ఉదాహరణ.