1788
Appearance
1788 గ్రెగోరియన్ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.
సంవత్సరాలు: | 1785 1786 1787 - 1788 - 1789 1790 1791 |
దశాబ్దాలు: | 1760లు 1770లు - 1780లు - 1790లు 1800లు |
శతాబ్దాలు: | 17 వ శతాబ్దం - 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం |
సంఘటనలు
[మార్చు]- ఏప్రిల్ 1: కర్నాటిక్ బ్యాంక్, మద్రాసు ప్రెసిడెన్సీలో స్థాపించబడిన మొదటి బ్యాంకు. దక్షిణ భారతదేశంలోని అనేక నగరాలకు సేవలందించింది.
- మే 30: తొలిసారిగా క్రికెట్కు పూర్తిస్థాయి నిబంధనావళిని మెరైల్బోన్ క్రికెట్ క్లబ్ రూపొందించింది.
- జూన్ 21: న్యూ హేంప్ షైర్ 9వ అమెరికన్ రాష్ట్రంగా అమెరికా (యునైటెడ్ స్టేట్స్) లో చేరింది.
- సెప్టెంబర్ 17: హైదరాబాదు నవాబు అయిన నిజాము ఆలీ ఖాను గుంటూరును బ్రిటీషు వారికి ఇచ్చివేసాడు. బ్రిటీషు వారు వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడును ఈ ప్రాంతానికి జమీందారుగా నియమించారు.
- డిసెంబర్ 18:రోహిల్లాలకు, మరాఠాలకు జరిగిన యుద్ధంలో మరాఠా జనరల్ మహాదాజీ సింధియా చేతిలో గులాం ఖాదిర్ ఓడిపోయి బందీ అయ్యాడు.
జననాలు
[మార్చు]- జనవరి 22: లార్డ్ బైరన్ ప్రసిద్ధ ఆంగ్లకవి. (మ.1824)
తేదీ వివరాలు తెలియనివి
[మార్చు]- గొడే సూర్యప్రకాశరావు, అనకాపల్లి సంస్థానం జమీందారు, గొప్ప సాహిత్య పోషకుడు, పండితుడు. (మ.1841)
- తులసిబాయి హోల్కర్, ఇండోర్ మహారాణి. భర్త మరణం తర్వాత తన కుమారుడు మల్హర్ రావ్ హోల్కర్ II తరఫున ఇండోర్ రాజ్యాన్ని 1811-1817ల మధ్య పరిపాలించింది.(మ.1817)
మరణాలు
[మార్చు]- డిసెంబర్ 6: నికోల్-రీన్ లెపాట్, ఫ్రెంచ్ ఖగోళ శాస్త్రవేత్త, గణిత శాస్త్రజ్ఞురాలు (జ.1723)
- డిసెంబర్ 14: స్పెయిన్ రాజు చార్లెస్ III (జ.1716)