1710
Appearance
1710 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1707 1708 1709 - 1710 - 1711 1712 1713 |
దశాబ్దాలు: | 1680లు 1690లు - 1700లు - 1710లు 1720లు |
శతాబ్దాలు: | 17 వ శతాబ్దం - 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం |
సంఘటనలు
[మార్చు]- ఫిబ్రవరి 17: 1638 నుండి డచ్ వలసగా ఉన్న మారిషస్ను, డచ్చి వారు వదిలేసారు.
- ఫిబ్రవరి 28 (స్వీడిష్ క్యాలెండర్ ప్రకారం) : హెల్సింగ్‌బోర్గ్ యుద్ధం : జుర్గెన్ రాంట్జౌ ఆధ్వర్యంలో పద్నాలుగు వేల మంది డానిష్ ఆక్రమణదారులు, మాగ్నస్ స్టెన్‌బాక్ ఆధ్వర్యంలో అంతే సంఖ్యలో ఉన్న స్వీడిష్ సైన్యం చేతిలో నిర్ణయాత్మకంగా ఓడిపోయారు.
- మార్చి 6: నోట్రే-డామ్ డి పారిస్ నేవ్ కింద ఒక క్రిప్ట్ నిర్మాణ సమయంలో బోట్మెన్ యొక్క పురాతన రోమన్ పిల్లర్ కనబడింది.
- ఏప్రిల్ 10: ప్రపంచంపు మొట్టమొదటి కాపీహక్కుల చట్టం, బ్రిటన్‌లో స్టాట్యూట్ ఆఫ్ అన్నే రూపంలో అమలులోకి వచ్చింది.[1]
- ఏప్రిల్ 19: గ్రేట్ బ్రిటన్ రాణి అన్నే నలుగురు మోహాక్ రాజులను కలుసుకుంది.[2]
- మే 6: సౌత్ సీ కంపెనీని స్థాపించారు.[3]
- మే 12:చప్పర్ చిరి యుద్ధంలో బందా సింగ్ బహదూర్ సిర్హింద్ గవర్నర్ వాజిర్ ఖాన్ ను, దివాన్ సుచానంద్ ను చంపాడు
- ఆగష్టు 20: స్పానిష్ వారసత్వ యుద్ధం - సారాగోసా యుద్ధం : మార్క్విస్ డి బే నేతృత్వంలోని స్పానిష్-బోర్బన్ సైన్యం, గైడో స్టార్‌హెంబెర్గ్, వారి మిత్రదేశాల ఆధ్వర్యంలోని హబ్స్‌బర్గ్ రాచరిక బలగాల చేతిలో ఓడిపోయింది.[4]
- ఆగస్టు 24: సంపూర్ణ సూర్య గ్రహణం. 36°30′S 105°06′W / 36.5°S 105.1°W వద్ద కనిపించింది.
- సెప్టెంబర్ 7: జోనాథన్ స్విఫ్ట్ రాసిన వ్యంగ్య గలివర్స్ ట్రావెల్స్‌లో, కల్పిత గలివర్ తన నాల్గవ, ఆఖరి ప్రయాణానికి బయలుదేరాడు, ఇది ల్యాండ్ ఆఫ్ ది హౌహన్హ్న్స్‌కు ప్రయాణించింది
- అక్టోబర్ 11: సిక్కులకు, మొఘల్ సామ్రాజ్యానికీ మధ్య రహోన్ యుద్ధం జరిగింది.
- అక్టోబర్ 13: క్వీన్ అన్నే యుద్ధం – పోర్ట్ రాయల్ ముట్టడి. ఫ్రెంచి వారు లొంగిపోయారు. నోవా స్కోటియా బ్రిటిష్ వారు శాశ్వతంగా స్వాధీనం చేసుకున్నారు.
- డిసెంబర్ 10: సిక్కు దళాలకూ మొఘల్ సైన్యానికీ మధ్య లోహ్ ఘర్ యుద్ధం జరిగింది.
- తేదీ తెలియదు: బీజింగ్, ఇస్తాంబుల్ను దాటి ప్రపంచంలోని అతిపెద్ద నగరంగా అవతరించింది.[5]
- తేదీ తెలియదు: అమరావతి సంస్థానం పాలకుడు చినపద్మనాభ రామన్న పరిపాలన ముగిసింది
- తేదీ తెలియదు: మేవాడ్ రాజుగా అమర్ సింగ్ II పదవీ కాలం (1698-1710) ముగిసింది
జననాలు
[మార్చు]- ఏప్రిల్ 13: జోనాథన్ కార్వర్, వలసవాద అమెరికన్ మిలిటరీ ఆఫీసర్ (మ .1780 )
- ఏప్రిల్ 25: జేమ్స్ ఫెర్గూసన్, స్కాటిష్ ఖగోళ శాస్త్రవేత్త (మ .1776 )
- ఏప్రిల్ 26: థామస్ రీడ్, స్కాటిష్ తత్వవేత్త (మ .1796 )
మరణాలు
[మార్చు]పురస్కారాలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Penguin Pocket On This Day. Penguin Reference Library. 2006. ISBN 0-14-102715-0.
- ↑ "Mashantucket Pequot Museum and Research Center". Archived from the original on November 21, 2007. Retrieved 2007-12-16.
- ↑ Thomas Tegg (1835). A Dictionary of Chronology ... Fourth edition [of "Chronology, or the Historian's Companion"], considerably enlarged. p. 321.
- ↑ Kamen, Henry (2000). Felipe V, el rey que reinó dos veces. Historia (3rd ed.). Madrid: Temas de Hoy. pp. 96–97. ISBN 8478808477.
- ↑ 1987 estimate. "Largest Cities Through History". Archived from the original on 2007-07-14. Retrieved 2012-08-20.