మార్క్సిజం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కార్ల్ మార్క్స్ పేరు మీదుగా మార్క్సిజం రూపుదిద్దుకుంది

మార్క్సిజం ఒక రాజకీయ తత్వం, సమాజ ఆర్థిక విధానాలను విశ్లేషించే పద్ధతి. 19వ శతాబ్దంలో జర్మనీకి చెందిన కార్ల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఎంగెల్స్ అనే తత్వవేత్తల రచనల ఆధారంగా రూపు దిద్దుకున్నదీ తత్వం. మార్క్సిజం అనేది కాలక్రమంలో అనేక మార్గాల్లో ఏర్పడిన పద్ధతి, దీనికి ఒకే సిద్ధాంతం అంటూ ఏదీ లేదు.[1]

ఒక సిద్ధాంతం రూపంలో మార్క్సిజం సమాజంమీదా, ప్రపంచ విద్యారంగం మీదా చెప్పుకోదగిన ప్రభావాన్ని చూపింది. ఆర్థిక శాస్త్రం, విద్య, సాంస్కృతిక అధ్యయనం, సాహిత్య విమర్శ, రాజకీయ శాస్త్రం, మానసిక విశ్లేషణ, సాంఘిక శాస్త్రం మొదలైన అనేక రంగాలు కొన్ని ఉదాహరణలు.

స్థూల దృష్టి

[మార్చు]

మార్క్సిజం మానవ భౌతిక అవసరాలను తీర్చడానికి కావలసిన భౌతిక పరిస్థితులు, ఆర్థిక కార్యకలాపాలను విశ్లేషించడం ద్వారా ఏదైనా సమాజంలోని సామాజిక దృగ్విషయాన్ని వివరించడానికి ప్రయత్నిస్తుంది. ఆర్థిక సంస్థ రూపం, లేదా ఉత్పత్తి విధానం, విస్తృత సామాజిక సంబంధాలు, రాజకీయ సంస్థలు, న్యాయ వ్యవస్థలు, సాంస్కృతిక వ్యవస్థలు, రసికత, భావజాలాలతో సహా అన్ని ఇతర సామాజిక దృగ్విషయాలను ప్రభావితం చేస్తుందని ఇది ఊహిస్తుంది.

మూలాలు

[మార్చు]
  1. Wolff, Richard; Resnick, Stephen (1987). Economics: Marxian versus Neoclassical. Johns Hopkins University Press. p. 130. ISBN 978-0801834806. The German Marxists extended the theory to groups and issues Marx had barely touched. Marxian analyses of the legal system, of the social role of women, of foreign trade, of international rivalries among capitalist nations, and the role of parliamentary democracy in the transition to socialism drew animated debates ... Marxian theory (singular) gave way to Marxian theories (plural).