Jump to content

ఫిఖహ్

వికీపీడియా నుండి

ఇస్లాం పై వ్యాసాల పరంపర
ఉసూల్ అల్-ఫిఖహ్

(న్యాయపాఠశాల పునాదులు)

ఫిఖహ్
అహ్‌కామ్
పండిత బిరుదులు

ఫిఖహ్ (అరబ్బీ : فقه ), ఇస్లాంలో ఇస్లామీయ న్యాయశాస్త్రం. షరియా విపులరూపమే ఫిఖహ్. ఫిఖహ్ నేరుగా ఖురాన్, సున్నహ్ ల ఆధారంగా తయారైన ఇస్లామీయ న్యాయధర్మశాస్త్రం. ఫిఖహ్ ఫత్వాలకు రూపాన్నిస్తుంది, ఉలేమాలు నిర్ణయాలు తీసుకుంటారు.

ఫిఖహ్ ముస్లిం సాంప్రదాయాలను, ఇస్లాం ఐదు మూలస్తంభాలను, సామాజిక న్యాయాలను పర్యవేక్షిస్తుంది. నాలుగు సున్నీ ముస్లిం ఫిఖహ్ పాఠశాలలు (మజహబ్) లు గలవు.[1]

పుట్టు పూర్వోత్తరాలు

[మార్చు]
ప్రపంచమంతటా న్యాయవిధానాలు.

ఫిఖహ్ పదానికి మూలం అరబ్బీ భాష, అర్థం, లోతైన అవహగాహన లేదా సంపూర్ణ అవగాహన.

ఇస్లామీయ చట్టం

[మార్చు]

ఇస్లామీయ చట్టం (ఫిఖహ్) రెండు ప్రధాన విషయాలను కలిగి ఉంది. 1. కార్య-సంబంధ చట్టాలు, 2. స్థితి-సంబంధ చట్టాలు.

చట్టాలు, కార్య-సంబంధాల ఆధారంగా ('అమలియ్య — عملية ) : ఇందులో :

  • కర్తవ్యం (Obligation) (పర్జ్)
  • సిఫారసు (Recommendation) (మన్‌దూబ్)
  • స్వీకారం (Permissibility) (ముబాహ్)
  • అస్వీకారం, లేదా ఏహ్యం (Disrecommendation) (మక్రూహ్)
  • నిషేధితం (Prohibition) (హరామ్)

చట్టాలు, స్థితి-సంబంధాల ఆధారంగా (వదీయ') : ఇందులో :

  • షరతు (Condition) (షర్త్)
  • కారణం (Cause) (సబబ్)
  • వారించడం (Preventor) (మనా)
  • స్వీకారం/కార్యాచరణంలో వుంచు (Permit/Enforce) (రుఖ్సాహ్, అజీమాహ్)
  • స్వీకారం/అసత్యం/నిరాకరణ (Valid/Corrupt/Invalid) (సహీహ్, ఫసద్, బాతిల్)
  • తగిన సమయం/రుణం/నెమరువేయడం (In time/Debt/Repeat) (అదా, అల్-ఖజా, ఇయాదా)

ముస్లిం న్యాయపండితులు : ఉలేమా

[మార్చు]

ముస్లిం న్యాయపండితులను ఉలేమా అంటారు, అర్థం; జ్ఞానులు. ఫిఖహ్ పండితులను ఫకీహ్లు అంటారు.

ఇవీ చూడండి

[మార్చు]


నోట్స్

[మార్చు]
  1. Glasse, Cyril, The New Encyclopedia of Islam, Altamira, 2001, p.141

మూలాలు

[మార్చు]
  • Doi, Abd ar-Rahman I., and Clarke, Abdassamad (2008). Shari'ah: Islamic Law. Ta-Ha Publishers Ltd., ISBN 978-1842000853 (paperback), ISBN 978-1-84200-087-8 (hardback)
  • Levy, Reuben (1957). The Social Structure of Islam. UK: Cambridge University Press. ISBN 978-0-521-09182-4.
"https://te.wikipedia.org/w/index.php?title=ఫిఖహ్&oldid=3120842" నుండి వెలికితీశారు