serve
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, విశేషణం, కొలుచుట, ఊడిగము చేసుట, పరిచర్య చేసుట, ఉపయోగించుట.
- they served him వాడివద్ద కొలువు గా వుండినారు, వాడి కొలువులో వుండినారు.
- those who serve God దేవుణ్ని కొలిచేవాండ్లు, భక్తులు.
- those who serve the temple గుడి పనివాండ్లు.
- they bought salt to serve them on the journey వాండ్లు దోవ కు వుప్పు కొనుక్కున్నారు.
- he served them cruelly వాడియెడల క్రౌర్యము చేసినాడు.
- do you know how served he them? వాండ్లకు వాడు చేసినది చూస్తివా.
- the cave served him for a house ఆ గుహ వాడికి ఇల్లుగా వుపయోగపడ్డది.
- his hand served himfor a cup వాడికి చెయ్యి గిన్నె అయినది.
- to serve out పంచిపెట్టుట, వినియోగము చేసుట.
- they served out the rice that was wanted for the troops దండువాండ్లకు బియ్యము ను పంచిపెట్టినారు.
- this served him right ఇది వానికి తగిన శిక్ష.
- what? you have caught a fever? it serves you right వోహో నీకు జ్వరము వచ్చినదా, ఇది నీకు కావలశినదే.
- he served them very well వాండ్లకు లెస్స గా వుపచరించినాడు, వాండ్లకు తగిన బుద్ది చెప్పినాడు.
- to serve up a meal వడ్డించుట.
- dinner was served at noon మధ్యాహ్న మన్నము వడ్డించబడ్డది.
- to serve a gun పిరంగిని బారు చేసుట, మందు వేశి గట్టించుట.
క్రియ, నామవాచకం, to suffice, be nough చాలుట, కొలుచుట, ఉపయోగించుట.
- the tide served at noon మధ్యాహ్నానికి పోటు వచ్చినది.
- this served as a screenఅది తెర గా వుండినది.
- this will serve for a seat ఇది కూర్చుండడానికి పనికివచ్చును.
- this serves to show his carelessness ఇందువల్ల వాడు జాగ్రత్తలేనివాడని తెలుస్తున్నది.
- this will serve for a table ఇది లాయానికి వుపయోగించును.
- this board will serve for a door ఈ పలక తలుపుకు అవును,తలుపు కు పనికివచ్చును.
- the dinner was served in silver or he served in silver వాడికి వెండిపాత్ర లలో వడ్డించినారు.
- this money will serve to support him for a month ఈ రూకలు వాడికి నెల దినాల కూటి కి చాలును.
- this grain will serve to support them for a year ఈ ధాన్యము వాండ్లకు సంవత్సరానికికూటికి చాలును.
- this serves to prove what I said నేను చెప్పినదానికి యిది దృష్టాంతమైనది.
- to be employed in ట్హే army; his father served for ten years వాడి తండ్రి పదియేండ్లు దండు లో కొలిచినాడు.
- he served in Chinaచీనాదేశములో కొలిచినాడు.
- అనగా చీనాకు పోయిన దండులో కొలువు వుండినాడు.
- Service, n. s.
- పని, కార్యము, ఉద్యోగము, ఊడిగము, ఉపయోగము, ప్రయోజనము.
- what serve has he done me? వాడు నాకేమి వుపకారము చేసినాడు.
- her parents were in serve దాని తలితండ్రులు పనివాండ్లుగా వుండినారు.
- he is not in the serve వాడికి సర్కారు కొలువు లేకుండా వున్నది.
- three ships were sent upon this serve యీ పనికి మూడు వాడలు పంపబడ్డవి.
- he has seen serve వాడు అనేక యుద్దములకు పోయి ఆరితీరి వున్నాడు.
- this knife has seen serve ఇది పాత కత్తి, officers of both serves, i. e.
- both soldiers and sailors దండు వాండ్లున్నువాడవాండ్లున్ను.
- I అమ్ now cut of serve నేను యిప్పుడు కోలువులేకుండా వున్నాను.
- this did him no serve యిందువల్ల వాడికి వొక ఫలము లేదు, యిది వాడికి నిష్ఫలమైనది.
- it would do you serve to go there నీవు అక్కడికిపోతే సఫలమవును.
- అక్కడికి పోతివంటే నీకు మంచిది.
- public office of devotion ఆరాధన.
- serve is held in this temple ఈ గుడిలో పూజ జరిగినది.
- series, or set, of dishes or plates పాత్ర సామగ్రి.
- my serve to you మీకు దండము, నీకు వొక దండము, ఇది తిరస్కారమైన మాట.
- the horse is at your serve నీకు కావలిస్తే ఈ గుర్రాన్ని యెక్కిపో.
- he placed his carriage at my serve వాడి బండిని నాకు యిచ్చిపెట్టినాడు.
- I have a room at your serve మీకు వొక గదిని వుంచి పెట్టినాను.
- I అమ్ at your serve తమ మనసు ప్రకారము చేస్తాను.
- stop till I have finished this, and then I shall be at your serve ఈపనిని ముగించేదాకా తాళు తరువాత నీవు యేమి చేయమంటే దాన్ని చేస్తాను.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).