1643
Appearance
1643 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంఘటనలు
[మార్చు]- జనవరి 21: అబెల్ టాస్మాన్ టోంగా ద్వీపాన్ని చూసాడు .
- ఫిబ్రవరి 6: అబెల్ టాస్మాన్ ఫిజీ దీవులను చూసాడు .
- మే 14: లూయిస్ XIV 4 ఏళ్ళ వయసులో అతడి తండ్రి లూయిస్ XIII స్థానంలో ఫ్రాన్స్ రాజు అయ్యాడు. 1715లో 77 సంవత్సరాల వయస్సులో మరణించే వరకు, మొత్తం 72 సంవత్సరాల పాటు అతని పాలన సాగింది. ఇది చరిత్రలో యూరోపియన్ చక్రవర్తుల్లోకెల్లా అత్యంత సుదీర్ఘ పాలన.
- మే 20: వాల్డివియాకు డచ్ యాత్ర : డచ్ నౌకాదళం ( హెండ్రిక్ బ్రౌవర్ నేతృత్వంలో) చిలీలోని కారెల్మాపు వద్దకు చేరింది. వెంటనే సమీపంలో దిగి కోటనూ గ్రామాన్నీ దోచుకుంది.
- అక్టోబర్ 28 వాల్డివియాకు డచ్ యాత్ర : డచ్ వారు చిలీలోని వాల్డివియాపై తమ ఆక్రమణను ముగించారు.
- డిసెంబర్ 25: హిందూ మహాసముద్రంలోని క్రిస్మస్ ద్వీపాన్ని బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ షిప్ రాయల్ మేరీకి చెందిన కెప్టెన్ విలియం మైనోర్స్ చూశాడు.
- డిసెంబర్ 28: వాల్డివియాకు డచ్ యాత్ర : డచ్ యాత్ర విఫలమై, తిరిగి డచ్ బ్రెజిల్‌లోని రెసిఫే వద్దకు చేరుకుంది.
జననాలు
[మార్చు]- జనవరి 4: ఐజాక్ న్యూటన్, సుప్రసిద్ధ భౌతిక, గణిత, ఖగోళ శాస్త్రవేత్త. (మ.1727)
- అక్టోబర్ 14: మొదటి బహదూర్ షా, భారత ఉపఖండాన్ని పాలించిన మొఘల్ చక్రవర్తులలో 7వ చక్రవర్తి. (మ.1712)