1616
Appearance
1616 గ్రెగోరియన్ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.
సంవత్సరాలు: | 1613 1614 1615 - 1616 - 1617 1618 1619 |
దశాబ్దాలు: | 1590 1600లు - 1610లు - 1620లు 1630లు |
శతాబ్దాలు: | 16 వ శతాబ్దం - 17 వ శతాబ్దం - 18 వ శతాబ్దం |
సంఘటనలు
[మార్చు]- జనవరి 10: ఇంగ్లీషు దౌత్యవేత్త సర్ థామస్ రో అజ్మీర్ కోటలో మొఘల్ చక్రవర్తి జహంగీర్‌ను దర్శించాడు.
- ఫిబ్రవరి 19: ఫిలిప్పైన్స్‌లోని మేయాన్ అగ్నిపర్వతం విస్ఫోటనాన్ని మొదటిసారి రికార్డు చేశారు.
- మార్చి 11: గెలీలియో గెలీలి పోప్ పాల్-Vను కలిసి కోపర్నికస్ ప్రతిపాదించిన సూర్య కేంద్రక సిద్ధాంతాన్ని బలపరిచి సూర్యుని చుట్టే భూమి తిరుగుతుందని నిర్ధ్వందంగా ప్రకటించాడు.
- మే 3: లాడన్ ఒడంబడికపై సంతకాలు జరిగాయి. ఫ్రాన్సులో వరుస తిరుగుబాట్లు నిలిచిపోయాయి.
- సెప్టెంబర్ 15: ఇటలీలోని ఫ్రాస్కాటీ నగరంలో ఐరోపాఖండంలోనే మొట్టమొదటి ఉచిత పబ్లిక్ స్కూల్ ప్రారంభమైంది.
- డిసెంబర్ 22: ఒక భారతీయ యువకుడు లండన్ నగరంలోని సెయింట్ డయోనిస్ బ్యాక్ చర్చిలో బాప్తిస్మము తీసుకుని పీటర్‌గా తన పేరును మార్చుకున్నాడు. ఆ విధంగా పీటర్ ఆంగ్లికన్ చర్చిలో క్రైస్తవ మతం స్వీకరించిన మొదటి భారతీయుడైనాడు.
తేదీవివరాలు తెలియనివి
[మార్చు]- నూర్‌హాచి తనను తాను చైనా చక్రవర్తిగా ప్రకటించుకున్నాడు. తరువాతి కాలంలో ఇతడు జిన్ సామ్రాజ్యాన్ని ఆరంభించాడు.
జననాలు
[మార్చు]- జనవరి 5:అలెక్జాండర్ వొన్ బోర్నాన్‌విల్లె, ఫ్లెమిష్ సైన్యాధ్యక్షుడు. (మ.1690)
- ఫిబ్రవరి 2:సెబాస్టియన్ బౌర్డాన్, ఫ్రెంచి పెయింటర్. (మ.1671)
- మార్చి 16:థామస్ జెర్వోయిస్, ఆంగ్ల రాజకీయవేత్త. (మ.1693)
- ఏప్రిల్ 8: ప్రిన్స్ గుర్షాస్పు మీర్జా, ఖుస్రౌ మిర్జా కుమారుడు.
- మే 23: సర్ ఎడ్వర్డ్ బాగట్, ఇంగ్లీష్ రాజకీయవేత్త. (మ.1673)
- జూన్ 23: షా షుజా, షాజహాన్ రెండవ కుమారుడు. (మ.1661)
- జూలై 10: ఆంటానియో డెల్ క్యాస్టిరో వై సావెడ్రా, స్పానిష్ కళాకారుడు. (మ.1668)
- ఆగష్టు 18: జాన్ హెర్వే, ఇంగ్లీష్ రాజకీయవేత్త. (మ.1680)
- సెప్టెంబర్ 9: నికొలాస్ డి విలాసిస్, స్పానిష్ పెయింటర్. (మ.1694)
- నవంబర్ 23: జాన్ వాలిస్, ఇంగ్లీష్ గణిత శాస్త్రజ్ఞుడు. (మ.1703)
- డిసెంబర్ 13: ఎడ్వర్డ్ ఛాంబర్లేన్, ఇంగ్లీష్ రచయిత. (మ.1703)
తేదీ వివరాలు తెలియనివి
[మార్చు]- కమలాకరుడు భారతీయ ఖగోళ శాస్త్రవేత్త, గణిత శాస్త్రవేత్త. (మ.1700)
మరణాలు
[మార్చు]- ఫిబ్రవరి 15: జార్జ్ కేరీ, ఇంగ్లీష్ రాజకీయవేత్త (జ.1541)
- ఏప్రిల్ 23: విలియం షేక్‌స్పియర్ ఆంగ్ల నాటక రచయిత (జ.1564)