1519
Appearance
1519 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1516 1517 1518 - 1519 - 1520 1521 1522 |
దశాబ్దాలు: | 1490లు 1500లు - 1510లు - 1520లు 1530లు |
శతాబ్దాలు: | 15 వ శతాబ్దం - 16 వ శతాబ్దం - 17 వ శతాబ్దం |
సంఘటనలు
[మార్చు]- మార్చి 4: హెర్నాన్ కోర్టెస్, అతని సహ ఆక్రమణదారులూ మెక్సికోలో అడుగుపెట్టారు.
- ఏప్రిల్ 21: హెర్నాన్ కోర్టెస్ శాన్ జువాన్ డి ఉలియాకు చేరుకున్నాడు; మరుసటి రోజు (గుడ్ ఫ్రైడే) అతను ఆధునిక వెరాక్రజ్ బీచ్‌లో అడుగు పెట్టాడు. [1]
- మే 2: 67 ఏళ్ల వయసులో లియోనార్డో డా విన్సీ మరణించాడు.
- జూన్ 28: స్పెయిన్ యొక్క చార్లెస్ I పవిత్ర రోమన్ చక్రవర్తి చార్లెస్ V అయ్యాడు (1556 వరకు పాలించాడు).
- ఆగస్టు 15: పనామా నగరాన్ని స్థాపించారు.
- ఆగష్టు 20: మింగ్ రాజవంశపు చైనా తత్వవేత్త, జియాంగ్జీ గవర్నర్ జనరల్ వాంగ్ యాంగ్మింగ్, ఝు చెన్హావోను ఓడించి, ప్రిన్స్ ఆఫ్ నింగ్ తిరుగుబాటును అణచివేసాడు. తిరుగుబాటును అణిచివేసేందుకు ఫో-లాంగ్-జి ఫిరంగులను ఉపయోగించాలనే ఉద్దేశ్యాన్ని వాంగ్ వ్యక్తం చేశాడు. బహుశా చైనాలో వెనక నుండి లోడు చేసే ఫిరంగి గురించిన తొలి ప్ర్స్తావన ఇది.
- సెప్టెంబర్ 20: ఫెర్డినాండ్ మాగెల్లాన్ స్పెయిన్ నుండి ఐదు నౌకలతో బయలుదేరి, పశ్చిమ దిశగా స్పైస్ దీవులకు ప్రయాణించాడు.
- అనాటోలియాలో మొదటి పౌర తిరుగుబాటు అలెవి బోధకుడు సెలేల్ నేతృత్వంలో జరిగింది.
- స్పానిష్ బార్బడోస్‌పై దాడి చేసింది.
- పనామా నుండి పసిఫిక్ తీరానికి ప్రయాణించే స్పానిష్ ఆక్రమణదారులు మొదట ఆధునిక నికరాగువాను గమనించి, గల్ఫ్ ఆఫ్ నికోయా వద్ద దిగారు. [2]
- మధ్య మెక్సికో అమెరిండియన్ల జనాభా 2.53 కోట్లకు చేరుకుంది.
- మెక్సికన్ ఇండియన్ యుద్ధాలు మొదలయ్యాయి.
- ప్రతాపరుద్ర గజపతి శ్రీకృష్ణదేవ రాయలకు తన కూతురు తుక్కా దేవిని (జగన్మోహిని) ఇచ్చి వివాహము చేసి సంధి చేసుకున్నాడు.
జననాలు
[మార్చు]
మరణాలు
[మార్చు]- మే 2 : లియోనార్డో డావిన్సీ, ఇటాలియన్ చిత్రకారుడు.
పురస్కారాలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Díaz del Castillo, Bernal. "Chapter 38". Historia Verdadera de la conquista de la Nueva España.
- ↑ Stanislawski, Dan (1983). The Transformation of Nicaragua 1519–1548. Ibero-Americana. Vol. 54. Berkeley; Los Angeles: University of California Press. ISBN 0-520-09680-0.