అక్షాంశ రేఖాంశాలు: 32°46′58″N 96°48′14″W / 32.78278°N 96.80389°W / 32.78278; -96.80389

డల్లాస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
డల్లాస్ నగరం
Flag of డల్లాస్ నగరం
Flag
Official seal of డల్లాస్ నగరం
Seal
ముద్దు పేరు: Big D,D-Town,Triple D
నినాదం: Live Large. Think Big.
డల్లాస్ కౌంటీలో , టెక్సాస్ రాష్ట్రములో స్థానం
డల్లాస్ కౌంటీలో , టెక్సాస్ రాష్ట్రములో స్థానం
డల్లాస్ కౌంటీలో , టెక్సాస్ రాష్ట్రములో స్థానం
అక్షాంశరేఖాంశాలు: 32°46′58″N 96°48′14″W / 32.78278°N 96.80389°W / 32.78278; -96.80389
దేశము అమెరికా సంయుక్త రాష్ట్రాలు
రాష్ట్రము టెక్సాస్
కౌంటీలు డల్లాస్
కాలిన్
డెంటన్
రాక్ వాల్
కౌఫ్ మాన్
స్థాపించబడినది 2 February 1856
ప్రభుత్వం
 - Type Council-manager
 - మేయరు Tom Leppert
వైశాల్యము
 - City 997.1 km² (385.0 sq mi)
 - భూమి 887.2 km² (342.5 sq mi)
 - నీరు 110.0 km² (42.5 sq mi)
ఎత్తు 131 m (430 ft)
జనాభా (2007)
 - City 1,232,940 (9th largest)
 - సాంద్రత 1,391.9/km2 (3,605.08/sq mi)
 - మెట్రో 6,145,037 (4th largest)
 - Demonym Dallasites
కాలాంశం Central (UTC-6)
 - Summer (DST) Central (UTC-5)
Area code(s) 214, 469, 972
FIPS code 48-19000[1]
GNIS feature ID 1380944[2]
ప్రధాన విమానాశ్రయము Dallas-Fort Worth International Airport- DFW (Major/International)
రెండవ విమానాశ్రయం Dallas Love Field- DAL (Major)
వెబ్‌సైటు: dallascityhall.com

డల్లాస్ లేదా డల్లాసుపురం అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఉన్న పెద్ద నగరాలలో ఇది 4వ స్థానంలో ఉంది. అమెరికాలో ఇది 9వ స్థానంలో ఉంది. డల్లాస్ నగరం జలభాగం, డల్లాస్ కౌన్టీ నియోజకవర్గాన్ని చేర్చకుండా భూభాగం మాత్రమే 342.5 చదరపు మైళ్ళు విస్తరించి ఉంటుంది. యునైటెడ్ స్టేట్స్ సెన్సస్ బ్యూరో లెక్కల ననుసరించి నగర జనాభా 2007 జూన్ 22 తారీఖుకు 1,232,940.

డల్లాస్ నగరం 12 కౌంటీలు కలిగిన డల్లాస్-ఫోర్ట్‌వర్త్ మహానగర ఆర్థిక కేంద్రం. ఈ రెండు ప్రాంతాలను కలిపి ప్రజలు ది మెట్రో కాంప్లెక్స్' 'అని అభిమానంగా పిలుచుకుంటూ ఉంటారు. డల్లాస్ మహానగరపాలిత ప్రాంతం 66 లక్షల జనాభాతో అమెరికాలో మహానరపాలిత ప్రాంతాలలో 4వ స్థానంలో ఉంది.

అంతర్జాతీయంగా ఉన్న నగరాల గురించి అధ్యయనంలో లగ్ బరో' 'విశ్వవిద్యాలయంచే ఈ నగరం నైరుతి ప్రాంత అమెరికాలో ఏకైకవిశ్వ నగరంగా అంతర్జాతీయ గుర్తింపు పొందింది.

డల్లాస్ నగరం 1841లో స్థాపించబడింది. 1856లో నగర హోదాను పొంది నగరపాలిత ప్రాంతం అయింది. నగరం ప్రధానంగా బ్యాంకింగ్, వ్యాపారం, సమాచార రంగం, విద్యుత్‌శ్చక్తి, కంఫ్యూటర్ విజ్ఞానం, రవాణా రంగాలపై ఆధార పడి ఉంది. డల్లాస్ భూమధ్యస్థంగా ఉంది కనుక ఇక్కడ నుండి జలమార్గాలు, సముద్రంతో సంబంధ బాందవ్యాలు తక్కువే. చమురు పరిశ్రమలకు, పత్తి పంటలకు డల్లాస్‌కు ప్రత్యేకత ఉంది. విస్తారంగా ఉన్న రైల్, రోడ్డు వసతుల కారణంగా ఇది బలవత్తరమైన రవాణా, పారిశ్రామిక, ఆర్థిక కేంద్రం అయింది.

చరిత్ర

[మార్చు]

డల్లాస్ ప్రాంతాన్ని స్పైన్ సామ్రాజ్యంచే ఆక్రమించబడక ముందు ఈ ప్రాంతంలో కాడో అమెరికన్ పూర్వీకులు నివసిస్తుండే వాళ్ళు. 16 వ శతాబ్దంలో డల్లాస్ ప్రాంతాన్ని స్పైన్ సామ్రాజ్యం వశపరుకున్న తరువాత ఈ ప్రాంతం న్యూ స్పైన్ ఆధీనంలోకి వచ్చింది. తరువాత ఈ ప్రాంతం ఫ్రెంచి వారిచే ఆక్రమించబడి ఆడమ్స్-ఒనిస్ ఒప్పందం తరువాత స్పైన్ ఉత్తర సరిహద్దు ప్రాంతం అయింది. 1821 వరకూ ఈ ప్రాంతం స్పైన్ ఆధీనంలోనే ఉంది. ఆ తరువాత మెక్సికో స్పైన్ నుండి విడిపడి స్వాతంత్ర్యం ప్రకటించుకున్న నేపథ్యంలో ఈ ప్రాంతం మెక్సికోలో ఒక భాగంగా కొనసాగింది. 1836లో టేక్సాస్ మెక్సికో నుండి విడి పడి రిపబ్లిక్ ఆఫ్ టెక్సాస్గా అవతరించడంతో ఈ ప్రాంతం టెక్సాస్ రిపబ్లికన్‌లో భాగంగా ఉంది. 1839లో ప్రస్తుత డల్లాస్ ప్రాంతం వారెన్ ఆంగుస్ ఫెర్రిస్‌చే సర్వే చేయబడింది. రెండు సంవత్సరాల తర్వాతజాన్ నీలి బ్రయాన్ నాయకత్వంలో జరిగిన శాశ్వత ఒప్పందం తరువాత డల్లాస్‌గా రూపొందింది. టెక్సాస్ ఈ ప్రాంతం 1845 నుండి అమెరికాలో ఒక భాగంగా చేర్చబడింది. తరువాతి సంవత్సరం డల్లాస్ కౌన్టీ స్థాపించబడింది.

భౌగోళికం

[మార్చు]

డల్లాస్ నగరం డల్లాస్ జిల్లా (కౌంటీ) యొక్క నియోజక వర్గం. ఈ నగరం చుట్టు పక్కల పరిసరాలలో ఉన్న కోలిన్, డెంటన్, కౌఫ్‌మాన్, రాక్‌వెల్ ప్రాంతాలను కలుపుకుంటూ విస్తరించింది. యునైటెడ్ స్టేట్స్ సెన్సస్ బ్యూరో వివరణ అనుసరించి నగర భూభాగం 342.5 చదరపు మైళ్ళు.జల భాగం 42.5 చదరపు మైళ్ళు.
డల్లాస్, దాని పరిసర ప్రాంతాలు చాలావరకు చదునైన ప్రదేశమే. భూభాగం ఎత్తు పల్లాలు సముద్ర మట్టానికి 450 నుండి 550 అడుగుల (150-180 మీటర్ల) మధ్య ఉంటుంది. నగరానికి పడమటి వైపు ఉత్తర దక్షిణ సరహద్దులను కలుపుతూ 200 అడుగుల ఎత్తులో ఆస్టిన్ చాక్ అనబడే సున్నపురాతి పొరలు ఉంటాయి. దక్షిణ సరిహద్దులో ట్రింటీ నది ప్రవహిస్తుంటుంది.
సాధారణంగా ప్రంపంచమంతా ఉన్నట్లుగానే జలవనరుల ఆధారితంగానే డల్లాస్ నగరనిర్మాణం జరిగింది. ట్రినిటీ నది తెల్లరాళ్ళను దాటుతున్న ప్రాంతంలో ఈ నగరం స్థాపించబడింది. ఈ నదిని ఈ ప్రాంతంలో దాటటం సులువు కనుక పడవలు, వంతెనలు లేని సమయంలో వ్యాగన్లు దాటటానికి ఈ ప్రాంతం అనువుగా ఉండేది. ఈ నది జలమార్గంగా ఉపయోగపడలేదు. ఈ నది నగర మూలం (డౌన్ టౌన్) ఉత్తర ప్రాంతం నుండి దక్షిణ డల్లాస్, ప్లెసెన్ట్ గ్రోవ్ మీదుగా హ్యూస్టన్ వైపు ప్రవహిస్తూ ఉంటుంది. ఈ నదికి ఇరువైపులా 50 అడుగుల ఎత్తైన మట్టి గోడలను నిర్మించి నగరాన్ని వరదల నుండి రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల దీర్ఘ కాలిక కోరికపై ఈ నదిని అందంగా రూపు దిద్ది ప్రజలకు విహార కేంద్రంగా రూపొందించాలని ప్రభుత్వంచే ప్రతిష్ఠాత్మకమైన ట్రినిటీ రివర్ ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టబడింది. అది 2000లలో ప్రారంభించబడి 2010 కంతా పూర్తిచేయాలని ప్రణాళిక చేయబడింది. నదీ ప్రాంతంలో ఉద్యానవనాలు, సరస్సులు, ప్రయాణ వసతుల అభివృద్ధి చేసి వినోద విహార కేంద్రంగా మార్చాలని ప్రత్నిస్తున్నారు. ఈ ప్రణాళిక కోసం ఉపయోగించబడే ప్రదేశం పొడవు నదీతీరం వెంట 20 మైళ్ళు. అంటే నగరాన్ని ఆనుకుని ఉన్న నదీ తీరమంతా ఉంటుంది. ఈ ప్రణాళీక కోసం 44,000 ఎకరాల స్థలం ఉపయోగించబడుతుంది. పచ్చదనానికి ఉపయోగించబడే ప్రదేశం 10,000 ఎకరాలు. ఈ ప్రణాళిక పూర్తయ్యే సమయానికి ఇది నగర ప్రాంతంలో రూపు దిద్దుకున్న బృహత్తర ఉద్యానవన ప్రాంతంగా మారుతుందని అంచనా.

20వ శతాబ్దంలో నిర్మిమించబడిన వైట్ రాక్ లేక్ డల్లాస్ యొక్క చెప్పుకోదగిన ఇతర జలాశయం. ఈ సరస్సు పరిసరాలలో ఉన్న ఉద్యానవనాలు ప్రజలకు చెప్పుకోతగిన విహార కేంద్రం. పరుగులు పెట్టేవారు, సైకిళ్ళు తొక్కేవారు, తెడ్డు లేదా మర పడవల విహారం చేసేవారు, ప్రశాంతతను కోరుకునే ప్రజలకు ఇది అభిమాన విహార కేంద్రం. సరస్సుకు తూర్పు తీరంలో డల్లాస్ వృక్ష ప్రదర్శనశాల-ఉద్యానవనం ఉంది. లౌ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్కు వాయవ్యంలో ఉన్న బచ్ హమ్ లేక్, లేక్ రే హబ్బర్డ్ విహార కేంద్రంగా ఉపయోగపడే మరో జలాశయం, గార్లెండ్, రాలెట్, రాక్‌వెల్, సన్నీవేల్ మధ్యలో విస్తారంగా 22,745 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. నగరానికి పడమట మౌంటెన్ క్రీక్ లేక్ ఉంది. ఇర్వింగ్, కోపెల్ మధ్య నార్త్ లేక్ ఉన్నాయి.

వాతావరణం

[మార్చు]

డల్లాస్ సమశీతోష్ణ మండలం. గాలిలో తేమ తక్కువ ఉంటుంది. వేసవిలో చల్లదనం చలికాలంలో వెచ్చదం ఇక్కడి వాతావరణాన్ని మరింత ఆహ్లాదకరంగా చేస్తుంది.

వాయవ్యంలో నుండి వచ్చే వేడి గాలులు వేసవి ఉష్ణోగ్రతను 110 ఫారెన్ హీట్ (45 సెల్సియస్) వరకూ తీసుకు వెళతాయి. చలికాలంలో చలి కొంత తక్కువగానే ఉంటుంది. సంవత్సరంలో కనీసం ఒకసారి ప్రతి చలికాలంలో చూడవచ్చు. దక్షిణ ప్రాంతం నుండి వచ్చే వెచ్చని తడిగాలులు తీవ్రమైన చలి నుండి కొంత రక్షణ కలిగిస్తాయి. కొన్ని సమయాలలో వీచే పొడి గాలులు గడ్డకట్టించే వర్షాలకు కారణమై పౌరుల దైనందిక కార్యక్రమాలను ఇబ్బంది పెట్టడం మామూలే.

డల్లాస్ నగర వసంత కాలం ఆహ్లాదకరంగా ఉంటుంది. ముఖ్యంగా డల్లాస్ ఎగువ భూముల్లో విరిసే అందమైన అడవి పూలు వింతశోభతో ప్రకృతి ఆరాధకులను అలరిస్తాయి. వసంతకాల వాతావరణంలో భిన్నత్వం అధికం. ఈ సమయంలో సంభవించే పెను తుఫానుల ప్రభావం ఈ నగరంపై ఉంటుంది. కెనడా దేశపు దక్షిణ సరిహద్దుల వీచే నుండి వీచే చలిగాలులు గల్ఫ్ తీరంనుండి వీచే తడిగాలులు డల్లాస్ భూములలో సంగమించి ఉరుములతో కూడిన వర్షాలు అద్భుతమైన మెరుపులూ, వడగళ్ళతో వర్షాలు అరుదుగా టొర్నాడోలు అనబడే సుడిగాలులు ఇక్కడ సర్వసహజం. టొర్నాడోలు డల్లాస్ నగర పెనుభీతిని కలిగించే ప్రకృతి విపత్తులలో ఒకటి.

డల్లాస్ వాతావరణం వృక్షాలకు అనుకూలమైంది కాదని యు ఎస్ డిపార్ట్ మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ పరిశీలనలో తేలింది. డల్లాస్ వాతావరణ కాలుష్యం లాస్ ఏంజలెస్, హ్యూస్టన్ తరువాతి స్థానంలో ఉన్నట్లు అమెరికా లంగ్ అసోసియేషన్చే సూచింపబడింది. ఓజోన్ కాలుష్యంలో డల్లాస్ నగరం అమెరికాలో 12వ స్థానంలో ఉంది. డల్లాస్, మహానగర పరిసర ప్రాంతాలు అధిక కలుషిత ప్రాంతంగా అంచనా. ఇక్కడి వాతావరణ కలుషితానికి కారణం ఆటోమొబైల్స్. అధికంగా ఇక్కడి ప్రజలు ఆటోమొబైల్స్ మీద ఆధారపడటమే ఇందుకు కారణం.

నగర రూపురేఖలు

[మార్చు]
డల్లాస్ స్కైలైన్

డల్లాస్‌లో నగరం 700 అడుగుల పైబడిన ఆకాశహర్మ్యాలు ఉన్న నగరాలలో ఒకటి. ఈ భవనాలు ఆంతర్జాతీయంగా డల్లాస్‌ను 15వ స్థానంలోకి చేర్చింది. నగరంలో ఉన్న భవనాలు 19వ శతాబ్ధపు ఆఖరులోనూ 20వ శతాబ్ధపు ఆరంభంలోనూ నిర్మించినవే అయినా నగరంలోని గుర్తించదగిన అనేక భవనాలు అధునిక శకములోనూ తరువాతి కాలంలో నిర్మించబడినవే. ఉదాహరణగా రీ యూనియన్ టవర్, జెకెఎఫ్ మెమోరియల్, ఐ ఎమ్ పీ యొక్క డల్లాస్ చిటీ హాల్, ఫౌన్‌టెన్ ప్లేస్, బ్యాంక్ ఆఫ్ అమెరికా ప్లాజా, రీనియాసెన్స్ టవర్, జెపి మొరగన్ చేస్ టవర్, కొమెరికా బ్యాంక్ టవర్ భవనాలు అధునిక నిర్మాణ శైలిలో నిర్మించబడిన ఉన్నత నిర్మాణాలు. ఆధునిక శైలిలో నిర్మించబడిన తక్కువ ఎత్తైన భవనాలు గోతిక్ రివైవల్ శైలిలో నిర్మించబడిన కిర్బీబిల్డింగ్ , నియోక్లాసికల్ శైలిలో డేవిస్ , విల్సన్ భవనాలు నిర్మించబడ్డాయి. స్విస్ అవెన్యూలో విక్టోరియా నుండి నియోక్లాసికల్ కాలం వరకూ నిర్మించిన అనేక వర్ణాలూ శైలీ కలిగిన పురాతన భవనాలు ఉన్నాయి.

నగరంలో నిర్మితమౌతున్న ట్రినిటీ రివర్ ప్రాజెక్ట్‌లో భాగంగా శాంటియాగో కలత్రావా రూపకల్పనలో అనేక అధునాతన వంతెనల నిర్మాణాలు ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా ముందుగా నిర్మాణాన్ని పూర్తి చేసుకున్న మార్గరేట్ హంట్ హిల్ బ్రిడ్జ్ వంతెనలో 40 అంతస్థుల ఎత్తు వరకూ నిర్మాణాలు ఉన్నాయి.

పరిసర ప్రాంతాలు

[మార్చు]

డల్లాస్‌లో ఆకర్షణలలలో మొదటిది నగర మధ్య భాగంలో ఉన్న డౌన్‌టౌన్ దీనికి ఉత్తర భాగంలో దీనిని ఆనుకుని ఓక్ టౌన్ తూర్పు భాగంలో అప్‌టౌన్ ఈ ప్రాంతాలు రిటైల్(చిల్లర) వర్తకం రెస్టారెంట్లు(ఆహారశాలలు) , నైట్ లైఫ్‌కు సంబందించిన వ్యాపారానికి ప్రధాన కేంద్రాలు. వెస్ట్ ఎండ్ హిస్టారిక్ డిస్ట్రిక్, ది ఆర్ట్స్ డిస్ట్రిక్, మెయిన్ స్ట్రీట్ డిస్ట్రిక్, ఫార్మర్స్ మార్కెట్ డిస్ట్రిక్, ది సిటీ సెంటర్ బిజినెస్ డిస్ట్రిక్, ది కాన్ వెన్షన్ సెంటర్ బిజినెస్ డిస్ట్రిక్, ది కాన్‌ వెన్షన్ సెంటర్ డిస్ట్రిక్ , రి యూనియన్ డిస్ట్రిక్ డౌన్ టౌన్‌లో భాగమే. ఉత్తరాన అప్ టౌన్, విక్టరీ పార్క్,ఓక్ లాన్, టర్టిల్ గ్రీక్, లోమెక్, సిటీ ప్లేస్ , వెస్ట్ విలేజ్ ఉన్నాయి.

డల్లాస్‌కు తూర్పున డీప్ ఎల్లమ్, లేక్ వుడ్, చారిత్రక ప్రాధాన్యమున్న విక్టరీ ప్లేస్, బ్రేయాన్ ప్లేస్, , పురాతన కళాత్మక భవనాలున్న సిస్ అవెన్యూ ఉన్నాయి. ఉత్తర భాగంలో పార్క్ సిటీస్, శ్రీమంతుల ఇళ్ళు ఉన్న ప్రిస్టన్ హల్లో ఉన్నాయి. ఇక్కడ ఖరీదైన షాపింగ్ సెంటర్లు ఉన్నాయి. గలేరియా డలాస్, నార్త్ పార్క్ సెంటర్, హైలాండ్ పార్క్ విలేజ్ , ప్రిస్టన్ సెంటర్ ఈ కోవలోకి చెందినవే. ఈశాన్య భాగంలో మధ్యతరగతి వారు అధికంగా నివసిస్తున్న "లేక్ హైలాడ్ ఉంది. ఆగ్నేయంలో ఓక్ క్లిఫ్ ఇది కొంచం ఎత్తైన కొండ ప్రాంతం. దీనికి సమీపంలో బిషప్ ఆర్ట్స్ డిస్ట్రిక్ ఉంది. ఓక్ క్లిఫ్ 1800లలో వేరొక ఊరుగా ఉంటూ 1903లో డల్లాస్‌లో కలపబడింది. ఇక్కడ అధికంగా హిపానిక్ నివాసాలుంటాయి. 1970లో నగర దక్షిణ ప్రాంతంలో ఆఫ్రికన్ అమెరికన్లు అధిక్యత అధికమై ఇది దారిద్యానికి, నేరాలకు కేంద్రమైంది.

నగర సంస్కృతి

[మార్చు]

ఆహార రంగం

[మార్చు]

డల్లాస్ల్ నగరం బార్బిక్యూ (కాల్చిన వంటకం) కు ప్రసిద్ధి, నోరూరించే మెక్సికన్, మెక్సికన్ -టెక్సాస్ పద్ధితుతో మిశ్రిత వంటలు ఇక్కడ ప్రసిద్ధమే. శీతల మర్గారిటా పానీయం, చిల్లీస్, రోమన్ & మెకరోనీ నగర చైన్ హోటళ్ళు, విరివిగా స్టీక్ హౌస్‌లూ నగర ఆహార సంస్కృతిలో భాగాలే.

2010 నాటి అంచనాల ప్రకారం ఈ మహానగర జనాభాలో దాదాపు 10 శాతం భారత ఉపఖండ మూలాల నుంచి వచ్చిన వారున్నారని తేలింది. 50 పైగా భారతీయ భోజనశాలలతో, అనేక హిందూ, సిక్ఖు, ముస్లిం దేవాలయాలతో, భారతీయులు తమ సంస్కృతికి దూరంకాకుండా బతకగలుగుతున్న కొద్ది అమెరికా నగరాలలో డల్లాస్-ఫోర్ట్ వర్త్ ఒకటి.

పత్రికలు

[మార్చు]

డల్లాస్ నగరంలో అనేక ప్రాంతీయ వార్తా పత్రికలు, దూరదర్శన్ స్టేషన్లు, రేడియో, మాగజిన్స్ (పత్రికలు). డల్లాస్ ఫోర్ట్ వర్త్ మొత్తం సమాచార రంగంలో అమెరికాలో 5వ స్థానంలో ఉంది. నగర పరిసరాలలో వివిధ సాంస్కృతిక పత్రికలు లభిస్తాయి. 63 రేడియో స్టేషన్లు ఉన్నాయి. వసతిగృహాలలో పర్యాటకులకు కావలసిన సమాచారం అందించే ట్రావెల్ హోస్ట్ పత్రిక లభిస్తుంది.

రోజంతా (24-7) హిందీ, తెలుగు, ఇంకా ఇతర భారతీయ భాషల్లో ప్రసారాలందించే ఫన్ ఏషియా వంటి రేడియో స్టేషన్లు ఇక్కడున్న మనదేశస్థులకి భాష, సంస్కృతులతో అనుబంధాలను పటిష్ఠంగా పదిలపరచేందుకు దోహదపడుతున్నాయి.

కాథడ్రల్ చర్చ్

డల్లాస్ నగరంలో అత్యధికంగా ప్రొటెస్టెంట్ క్రిస్టియన్లు ఉన్నారు. మెథడిస్ట్, బాప్టిస్ట్ చర్చీలు ప్రత్యేకంగా అన్ని నగరమంతా ఉన్నాయి. సదరన్ మెథడిస్ట్ యూనివర్శిటీ, డల్లాస్ బాప్టిస్ట్ యూనివర్శిటీలు మతసంస్థచే నడప బడుతున్నాయి. నగరంలో మోర్మన్ మతస్తులు గుర్తించదగిన సంఖ్యలో ఉన్నారు. ఈ కారణంగా ది చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ లేటర్ డే సెయింట్స్ చే నగరంలో 1884లో బృహత్తర చర్చ్ నిర్మాణం జరిగింది.

కాథలిక్ చర్చ్ కూడా డల్లాస్ నగరంలో ప్రాముఖ్యత కలిగిన మతాలలో ఒకటి దీని ఆధ్వర్యంలో యూనివర్శిటీ ఆఫ్ డల్లాస్ విశ్వవిద్యాలయం నడపబడుతుంది. తరువాతి స్థానంలో ముస్లిమ్ మతస్థులు ఉన్నారు. వీరు నగర ఉత్తర, ఈశాన్య భాగంలో అధికంగా ఉన్నారు. డల్లాస్‌ డౌన్‌టౌన్‌కు ఉత్తరంలో40 మైళ్ళ దూరంలో పురాతన మసీదు ఉంది.

డల్లాస్ నగరం, పరిసర ప్రాంతాలలూ యూదులు పెద్దసంఖ్యలో ఉన్నారు. వీరు అధికంగా ఉత్తర భాగంలో ఉంటారు. డల్లాస్ నగరంలో బౌద్ధ మతస్థుల సంఖ్య కూడా ఎక్కువే. వీరందరూ తాయ్‌లాండ్, శ్రీలంక, నేపాల్, కంబోడియా, వియత్నామ్, లోయాశ్, టిబెట్, చైనా, తైవాన్, జపాన్ నుండి వలస వచ్చిన వారు.

సంఘటనలు

[మార్చు]

డల్లాస్ నగరంలో జరిగే ప్రధాన వేడుకలలో స్టేట్ ఫైర్ ఆఫ్ టెక్శాస్ ఒకటి. ఇది 1886 నుండి ప్రతి సంవత్సరం ఫెయిర్ పార్క్లో నిర్వహించబడుతుంది. నగర ఆదాయంలో 350 అమెరికా డాలర్లు జమ చేస్తున్న బృహత్తర వేడుకలలో ఇది మొదటిది. ది రెడ్రివర్ షూట్ ఔట్ పేరుతో నిర్వహించబడుతున్న ఫుట్ బాల్ మ్యాచ్. మెక్సికన్‌లచే నిర్వహించబడే సినో డీ మాయో, లోవర్ గ్రీన్ విల్లే అవెన్యూలో జరిగే పేరేడ్ సెయింట్ పాట్రిక్ డే, ది గ్రీక్ ఫొడ్ ఫెస్టివల్స్ ఆఫ్ డల్లాస్, సెడార్ స్ప్రింగ్ రోడ్లో జరిగే ప్రతిసంవత్సరం నిర్వహించబడే హేలోవిన్ పేరేడ్, న్యూ ఇయర్స్ ఈవ్ ఉత్సవాలు నగరంలో జరిగే ప్రధాన వేడుకలు.

ఆర్ధిక రంగం

[మార్చు]

డల్లాస్ నగరం ఆర్థికంగా పొరుగున ఉన్న ఫోర్ట్ వర్త్లోని కేటిల్ (పశువులు) మార్కెట్ అధారితంగా ఉండేది. డల్లాస్ నగరంలో పశువులను పెంపకానికి సంబంధించిన ఫార్మ్‌లు ఎక్కువగా ఉండేవి. ఇండియన్ వ్యాపార కూడలిగా ఉండటం నగరాదాయనికి తోడ్పడింది. 1873లో డల్లాస్ నగరం మీదుగా అనేక రైల్ రోడ్ల నిర్మాణం జరగటం ఆర్థికపరమైన మార్పులకు పునాది పడింది. తరువాత డల్లాస్ సాంకేతికంగా కూడా అధివృద్ధి చెందడం ప్రారంభం అయింది. 1900లో డల్లాస్ పత్తి పంటకు పెద్ద వాణిజ్య కేంద్రంగానూ, జిన్నింగ్ (పత్తిని గింజలనూ వేరుచేసే) యంత్రాల తయారీలో అంతర్జాతీయంగా అభివృద్ధి చెందింది. 1900 నాటికి డల్లాస్ అమెరికా నైరుతి భాగమంటికీ ఆర్థిక కేంద్రంగా మారింది. 1914లో లెవెన్‌త్ ఫెదరల్ రిజర్వ్ డిస్ట్రిక్ స్థానానికి ఎంచుకొనబడింది. 1925 నాటికి మూడింట ఒక భాగం టెక్సస్ రాష్ట్రంలో తయారైంది. 31% పత్తి డల్లాస్‌లోనే తయారు చేయబడింది. 1930లో డల్లాస్ తూర్పు భూభాగంలో చమురు నిల్వలు కనుగినబడ్డాయి. తరువాత టెక్సాస్‌లోని పర్మియన్ బేసిన్, ది పన్ హేండిల్, ది గల్ఫ్ కోస్ట్, ఒక్లహోమా ప్రాంతాలలో చమురు నిలవలు బయటపడటం డల్లాస్ చమురు వాణిజ్య కేంద్రంగా బలపడింది.

రెండవప్రపంచ యుద్ధానంతరం సమాచార రంగం దానికి సంబంధించిన కోలినోస్ రేడియో కార్పొరేషన్ లాంటి కంపెనీలు డల్లాస్‌లో స్థాపించబడ్డాయి. కొన్ని దశాబ్ధాల తరువాత కూడా ఈ పరిస్థితి కొనసాగుతూనే ఉంది. సమాచార రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పుల వలన ఈ రంగం నుండి నగరానికి అధిక భాగం ఆదాయం లభిస్తుంది.

1980 నుండి నగరంలో నిర్మాణరంగం అభివృద్ధి ప్రారంభం అయింది. నగర జనసంఖ్య ఆకాశానికి దూసుకు వెళ్ళడంతో నివాస గృహాల ఆవశ్యకత పెరగడమే ఇందుకు కారణం. ఉపాధి అవకాశాలు అధికం అయ్యాయి. డల్లాస్‌లోని డౌన్‌టౌన్‌లో ఉన్న బృహత్తర భవానాలు ఇందువలన లబ్ధి పొందాయి. ఆర్థిక పరమైన ఇబ్బందుల కారణంగా డౌన్‌టౌన్‌లో బృహత్తర నిర్మాణాల అభివృద్ధికి అడ్డుకట్ట పడింది. 1980 నుండి 2000 కొంత అభివృద్ధి పొడచూపినా తరువాత వెనుకడుగు వేసింది. ప్రస్తుతం డల్లాస్-ఫోర్ట్‌ వర్త్ మెట్రోప్లెక్స్ నిర్మాణ రంగంలో నిశ్శబ్ధం చోటు చేసుకుంది.

డల్లాస్ నగరానికి 20వ శతాబ్దంలో ఉన్న ప్రాముఖ్యత కొంత తగ్గినా ప్రస్తుత కాలంలో కూడా అనేక వస్తువుల తయారీ ఇంకా జరుగుతూనే ఉంది. 10,400 మందికి ఉపాధి కలిగిస్తున్న టెక్సాస్ ఇన్స్‌ట్రుమెంట్స్, రక్షణ, విమానాల తయారీ నగర ఆదాయంలో ముఖ్యపాత్ర వహిస్తూ ఆధిక్యతలో ఉన్నాయి. డల్లాస్ నగరంలో షాపింగ్ సెంటర్లు అధికం. పౌరుల కొనుగోలు శక్తి అమెరికాలో మొదటి స్థానంలో ఉంది. టెక్సాస్‌లో ఉన్న పెద్ద షాపింగ్ సెంటర్లలో రెండు డల్లాస్‌లో ఉన్నాయి. అవి గలేరియా షాపింగ్ సెంటర్, నార్త్ పాక్ సెంటర్. 1931లో ప్రారంభించిన హైలాండ్ పార్క్ విల్లేజ్ కూడా ముఖ్యమైన షాపింగ్ సెంటర్లలో ఒకటి. నగరంలో పర్యాటకులను ఆకర్షించే వాటిలో ఇవి కూడా ఒకటి. ఫోర్ట్ వర్త్‌లో ఉన్న 8 మంది బిలియనీర్స్‌ను చేర్చకుండానే డల్లాస్ నగరంలో నివసిస్తున్న 15 మంది బిలియనీర్లతో అంతర్జాతీయంగా ధనవంతులు అధికంగా నివసిస్తున్న నగరంగా 9వ స్థానంలో ఉంది. వ్యాపార పరమైన కూటములు జరిపేవారికి డల్లాస్ 3వ ప్రబలమైన కేంద్రం. డల్లాస్ కాన్‌వెన్‌షన్ సెంటర్ అతి పెద్ద అంతర్జాతీయంగా ప్రథమ స్థానంలో ఉన్న ఏకైక కాన్‌వెన్‌షన్ సెంటర్. దాని వైశాల్యం 10,00,000 చదరపు అడుగులు. బొద్దు పాఠ్యం

నేరము-చట్టము

[మార్చు]

డల్లాస్ నగరంలో 14 కౌన్సిల్ ప్రతినిధులు కలిగిన కౌన్సిల్-మేనేజర్ గవర్నమెంట్ మేయర్‌తో కలసి పాలనా నిర్వహణ చూస్తుంటారు. డల్లాస్ పోలీస్ వ్యవస్థ డల్లాస్ పోలీస్ డిపార్ట్‌మెంట్లో 2,977 ఆఫీసర్లు ఉన్నారు. పోలీస్ కార్యాలయం డల్లాస్ దక్షిణ పరిసరం సెడార్‌లో ఉంది. 1000 మందికి 12.06 నేరాలు నమోదౌతున్నాయి.

అగ్నిమాపకము

[మార్చు]

అగ్ని ప్రమాదాలనుండి రక్షణ, అత్యవసర వైద్య సేవలను డల్లాస్ ఫర్-రెస్‌క్యూ అందిస్తుంది. ఇందులో 1,670 మంది ఉద్యోగులు ఉన్నారు. అగ్నిమాపక దళానికి నగరంలో 56 కార్యాలయాలు ఉన్నాయి. ఫెయిర్ పార్క్ సమీపంలో 1907లో డల్లాస్ నగరంలో నిర్మించిన మొదటి అగ్నిమాపకదళం కార్యాలయంలో డల్లాస్ ఫైటర్స్ మ్యూజియమ్ ఉంది. 1995లో 22 వారాల పాటు నిర్వహించిన అగ్నిమాపక దళ శిక్షణా కేంద్రం శాశ్వత శిక్షణా కేంద్రంగా మారింది. దీనిని స్థానికులు డ్రిల్ టవర్ అని పిలుస్తారు.

జనసంఖ్య

[మార్చు]

డల్లాస్ నగర జనసంఖ్య 2000లో నిర్వహించిన జనసంఖ్య గణాంకాలను అసరించి జనాభా సంఖ్య 1,188,580. వీటిలో గృహనిర్వహణ జరిపే వారి సంఖ్య 451,833. కుటుంబాలుగా నివసిస్తున్న వారి సంఖ్య 266,580. ఒక చదరపు మైలులో జనసాంద్రత 3,469.9. ఒక చదరపు మైలుకు 1,413.3 గృహాలు 484,117 గృహాలు ఉన్నాయి. 18 సంవత్సరాల కంటే తక్కువ వయసు కలిగిన పిల్లలు ఉన్న కుటుంబాల శాతం 33.3%, విథిత కుటూంబాల శాతం 38.8%. భర్త లేకుండా కుటుంబ నిర్వహణ చేస్తున్న వారి శాతం 14.9%, కుటుంబం కాకుండా గృహనిర్వహణ చేస్తున్న వారి శాతం 41.0% అని యునైటెడ్ స్టేట్స్ సెన్సస్ బ్యూరో గణాంకాల వివరణ.మొత్తం జనాభాలో వివాహబంధం లేకుండా కలసి జీవిస్తున్న జంటల సంఖ్య 23,959. ఒంటరి జీవితం నడుపుతున్న వారి శాతం 32.8%. 65 వయసు పైబడి ఒంటరి జీవితం గడుపుతున్న వారి శాతం 6.5%. సరాసరి గృహ నివాసితుల శాతం 3%. సరాసరి కుటుంబ సభ్యుల శాతం 3.37%.

నగరంలో 18 వయసు లోపున్న వారి శాతం 26.6%. 18 నుండి 24 వయసు లోపున్న వారి శాతం 11.8%, 25 నుండి 44 వయసు లోపున్న వారి శాతం 35.3%, 45 నుండి 64 వయసు లోపున్న వారి శాతం 17.7%, 65 వయసు పైపడిన వారి శాతం 8.6%. సరాసరి వివాహ వయసు 33.11. ప్రతి 100 మంది స్త్రీలకు పురుషులు 101.6. 18 వయసులోపున్న 100 మంది స్త్రీలకు పురుషుల సంఖ్య 100.5.

డల్లాస్ నగర పౌరుల సరాసరి గృహనిర్వహణ ఆదాయం 37,628 అమెరికా డాలర్లు. సరాసరి కుటుంబ ఆదాయం 40,921 అమెరికా డాలర్లు. సరాసరి పురుషుల ఆదాయం 31,149 అమెరికా డాలర్లు. సరాసరి స్త్రీల ఆదాయం 28,235 అమెరికా డాలర్లు. సరాసరి తలసరి ఆదాయం 22,183 అమెరికా డాలర్లు. దారిద్యరేఖకు దిగువన ఉన్న కుటుంబాల శాతం 14.9%. ప్రజలలో దారిద్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాల శాతం 17.8%. వారిలో 18 వయసు లోవున్న వారి శాతం 25.1%. 65 వయసు పైబడిన వారి శాతం 13.1%. 2006లో ఒక ఇంటి ఖరీదు 1,23,800 అమెరికా డాలర్లు.

డల్లాస్ నగరంలో శ్వేతజాతీయుల శాతం 50%, నల్ల జాతీయుల శాతం 25.88%, అసియన్ల శాతం 4.5%, అమెరికన్ పూర్వీకుల శాతం 1%. పసిఫిక్ ఐలాడర్ శాతం 0.5%, ఇతరుల శాతం 20%, మిశ్రమ జాతుల 5.3%. మొత్తం ప్రజలలో అన్ని జాతులకు చెందిన హిస్పానిక్‌ల, లాటినోల శాతం 35%. డల్లాస్ మెక్సికన్ నుండి చట్టరీతిగానూ, అక్రమంగానూ వలస వచ్చే వారికి ఒక ప్రధాన గమ్యం. నగర ఆగ్నేయ, నైరుతి మూలలలో ఉన్న ఓక్క్లిఫ్, ప్లెజెన్ట్ గ్రోవ్ లలో నల్లజాతీయులు, హిస్పానిక్ ప్రజలు ఎక్కువగా నివసిస్తున్నారు. నగర దక్షిణ ప్రాంతంలో మొదటి నుండి నల్ల జాతీయులు అధికం. నగర ఉత్తర ప్రాంతంలో శ్వేత జాతీయులు అధికం. ఆసియన్ అమెరికన్లు అధికంగా నివసిస్తున్న ప్రదేశాలు డల్లాస్, పరిసర ప్రాంతాలు. వీరిలో కొరియన్లు, తైవానీలు, చైనీయులు, ఫిలిప్పైనీయులు, వియత్నామీయులు, భారతీయులు, పాకిస్థానీయులు, బంగ్లాదేశీయులు, అరేబియన్లు ఉన్నారు. ప్రత్యేకంగా నగర పరిసర ప్రాంతాలైన గార్లెండ్, రిచర్డ్సన్, ప్లానో, కరోల్టన్, ఇర్వింగ్, ఆర్లింగ్‌టన్, ఫ్రిస్కో, అలెన్ వీరి సంఖ్య అధికం. ప్రత్యేకంగా సగం డల్లాస్ పౌరులు టెక్సాస్ వెలుపలి ప్రాంతాలలో జన్మించిన వారే. చాలా మంది నివాసితులు ఇతర ప్రాంతాల నుండి వలస వచ్చి ఇక్కడ నివసిస్తున్న వారే ప్రత్యేకంగా మిడ్‌ వెస్ట్, ఈశాన్యం, కలిఫోర్నియా లాంటి సన్ బెల్ట్ ప్రాంతాల నుండి వలస వచ్చిన వారు.

విద్య

[మార్చు]

డల్లాస్‌లోని స్టేమన్స్ కారిడార్ ఉన్న యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్ సౌత్‌వెస్ట్ మెడికల్ స్కూల్ అంతర్ఝాతీయంగా ఆనేక వైద్యవిద్యా శాఖలతో పనిచేతున్న పెద్ద వైద్య విశ్వవిద్యాలయం. ఇది యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్ సౌత్‌వెస్ట్ మెడికల్ సెంటర్ ఎట్ డల్లాస్లోని ఒక భాగము. ఇది విద్యార్థులను చేర్చుకోవడంలో సామర్ధ్యానికి అధిక ప్రాముఖ్యత నిచ్చే వైద్య పాఠశాల. సంవత్సరానికి 200 మంది విద్యార్థులను మాత్రం చేర్చుకుంటారు. ఇక్కడ 3,255 మంది విద్యార్థులు ఉన్నత విద్యనభ్యసిస్తున్నారు. ఇక్కడ చదివిన విద్యార్థులలో ముగ్గురు వైద్య సాస్త్రంలోనూ, ఒకరు రసాయన శాస్త్రంలోనూ నోబెల్ బహుమతి అందుకున్నారు.

యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ ఎట్ ఆర్లింగ్ టన్ నూరేళ్ళకు పైబడిన చరిత్ర గల విశ్వ విద్యాలయం. ఉత్తర ప్రాంతంలోని రిచర్డ్ సన్ నగరంలో 1990 లలో ప్రారంభించబడిన యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ ఎట్ డల్లాస్ నగరంలో మరో ప్రముఖ విద్యాలయంగా రూపుదిద్దుకుంటోంది.

డల్లాస్ దక్షిణంలో పర్వత సాణువులలో ఉన్న కో ఎజ్యుకేషన్ డల్లాస్ బాప్టిస్ట్ యూనివర్సిటీ 1965లో డికేటర్ నుండి డల్లాస్‌కు మార్చబడింది. ఇక్కడ ప్రస్తుతం 5,100 మంది విద్యార్థులు ఉన్నారు.

డల్లాస్ ఈశాన్యంలో చారిత్రక నల్లజాతీయుల కళాశాల పౌల్ క్విన్ కాలేజ్ను 1993లో వీకో లోని బిషప్ కాలేజ్ ఆవరణ నుండి ఇక్కడ స్థాపించారు. ఇక్కడ 3000 మండి ఉన్నట విద్యను అభ్యసిస్తున్నారు.

డల్లాస్‌లోని యూనివర్శిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్ అండ్ డల్లాస్ ప్రస్తుతం ఇంట్రర్ స్టేట్ 20లో ఉంది. దీనిని హ్యూస్టన్ స్కూల్ రోడ్‌కు మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీని నిర్మాణం పూర్తి చేసుకుంటే ఇది డల్లాస్ నగర మొదటి విశ్వవిద్యాలయం ఔతుంది. డల్లాస్ దక్షిణంలో 3 మైళ్ళ దూరంలో ఉన్న డల్లాస్ టెక్నలాజికల్ సెమినరీ ఎవాంజికల్ ఫైత్‌కు చెందిన గుర్తింపు పొందిన విద్యాసంస్థ. ఇందులో 2,000 మంది ఉన్నత విద్యనభ్యసిస్తున్నారు.

ప్రభుత్వ పాఠశాలలు

[మార్చు]

డల్లాస్ పరిసర ప్రాంతాలలో ఉన్న అనేక పాఠశాలలు డల్లాస్ ఇండిపెండెంట్ స్కూల్ డిస్ట్రిక్లో భాగమే. డల్లాస్ స్కూల్ డిస్ట్రిక్ అమెరికాలో 12వ స్థానంలో ఉంది. ఇందులో 161,000 మంది విద్యార్థులున్నారు.

ప్రయాణ సౌకర్యాలు

[మార్చు]

డల్లాస్ నగర పౌరులు మిగిలిన అమెరికా నగరాల్లో మాదిరి ఆటో మొబైల్స్ లోనే ప్రయాణిస్తుంటారు. ప్రస్తుతం ఇతర సౌకర్యాలను అభివృద్ధి పరచి ఈ పరిస్థితిలో మార్పులు తీసుకురావాలని నగర నిర్వాహం ప్రయత్నాలు ప్రారంభించింది. లైట్ రైల్ మార్గాల నిర్మాణం, సైక్లింగ్, వాకింగ్‌ పాత్‌లు, బస్సులు, ట్రాలీ లాటివి అభివృద్ధి చేసి పౌరుల ప్రయాణ శైలి మార్చాలని ప్రయత్నిస్తున్నారు.

డల్లాస్ నగరంలో 20,30,35ఎ, 45 పేరుతో నాలుగు రహదార్లు ఉన్నాయి. ఫ్రీ వేస్ వేగన్ వీల్ వ్యూహంతో నిర్మించబడ్డాయి. ఈ వ్యాహంలో అన్ని మార్గాలు ఒక కూడలిలో కలుస్తాయి. బెల్ట్ రోడ్ ఒకటి ఉంది. కోలిన్ కౌంటీ నుండి 45 మైళ్ళ రెండవ బెల్ట్ రోడ్డు నిర్మించే ప్రణాళిక వేస్తున్నారు.

డల్లాస్ నగరంలో ప్రభుత్వ సంస్థ డల్లాస్ ఏరియా రాపిడ్ ట్రాన్‌సిస్ట్ హెచ్ ఓ వి వాహన మార్గాలు, బస్సులు, రైల్ ద్వారా ప్రజలకు ప్రయాణ వసతులు కల్పిస్తుంది. దీనిని క్లుప్తంగా డార్ట్ అంటారు. 1996లో ఒక రైలు మార్గంతో ఆరంభించి ప్రస్తుతం రెడ్ లైన్, బ్లూ లైన్ రెండు మార్గాలలో రైల్ సర్వీసులు ఉన్నాయి. రెడ్ లైన్ ఓక్ క్లిఫ్, దక్షిణ డల్లాస్, అప్ టౌన్, డౌన్ టౌన్, ఉత్తర డల్లాస్ రిచర్డ్సన్, ప్లానోల ద్వారా ప్రయాణిస్తుంది. బ్లూ లైన్ 8వ, ‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍ఓక్ క్లిఫ్, తూర్పు డల్లాస్, అప్ టౌన్, డౌన్ టౌన్, లేక్ డల్లాస్, గార్లెండ్ ద్వారా ప్రయాణిస్తుంది. రెడ్, బ్లూ లైన్‌లు 8వ, కోరిన్త్ స్టేషను, ఓక్ క్లిఫ్, మోకింగ్ బర్డ్ స్టేషను‌లలో కలుసు కుంటాయి. నిర్మాణంలో ఉన్న భూగర్భ రైల్ గ్రీ, ఆరంజ్ లైన్లు డి ఎఫ్ డబ్ల్యూ విమాశ్రయం, లవ్ ఫీల్డ్ విమానాశ్రయం, ఇర్వింగ్, లాస్ కోలినాస్, కరోల్టన్, ఫార్మర్స్ బ్రాంచ్, ది స్టిమన్స్ కారిడార్, విక్టరీ పార్క్, డౌన్ టౌన్, డీప్ ఎల్లమ్, ఫెయిర్ పార్క్, దక్షిణ డల్లాస్, ప్లెజెన్ట్ గ్రోవ్ మార్గాలలో ప్రయాణిస్తాయి.

ఫోర్ట్ వర్త్ రై లైన్ దిటి ప్రయాణీకులను కమ్యూటర్ లైన్ ద్వారా ప్రయాణీకులను డార్ట్ లైన్ 6కు చేరుస్తుంటాయి. ట్రింటీ రైల్వే ఎక్స్‌ప్రెస్ డౌన్ టౌన్ డల్లాస్ నుండి యూనియన్ స్టేషను ద్వారా డౌన్ టౌన్ ఫోర్ట్ వర్త్ వరకూ నడుస్తుంటాయి.

డల్లాస్ నగరంలో రెండు విమానాశ్రయాలు విమాన సేవలనందించడంలో సహాయపడుతున్నాయి. నగరంలో డల్లాస్ అండ్ ఫోర్ట్ వర్త్ అంతర్జాతీయ విమానాశ్రయం, లవ్ ఫీల్డ్ విమానాశ్రయం అదనంగా విమాన దళం ఉపయోగంలో డల్లాస్ ఎగ్జిక్యూటివ్ విమానాశ్రయం నగరం వెలుపలి ప్రాంతం అడిషనన్‌ కౌంటీలో ఉన్న అడిషన్ విమానాశ్రయం 35 మైళ్ళ దూరంలో మరో రెండు విమానాశ్రయాలు ఉత్తర డల్లాస్ మెక్ కిన్నీలోనూ మరో రెండు విమానాశ్రయాలు ఫోర్ట్ వర్త్ మెట్రో ప్లెక్స్ పడమటి ప్రాంతంలో ఉన్నాయి. మొత్తం ఆరు విమానాశ్రయాలు వాయు సేన ఆధీనంలో పనిచేస్తున్నాయి. డల్లాస్ అండ్ ఫోర్ట్ వర్త్ అంతర్జాతీయ విమానాశ్రయం ఇరు నగరాలకూ దాదాపు సమాన దూరంలో ఉంది. ఇది రాష్ట్రంలో మొదటి స్థానంలోనూ, దేశంలో రెండవ స్థానంలోనూ, అంతర్జాతీయంగా మూడవ స్థానంలోనూ ఉంది. సేవలలో రాష్ట్రంలో మొదటి స్థానంలోనూ, దేశంలో మూడవ స్థానంలోనూ, అంతర్జాతీయంగా ఆరవ స్థానంలోనూ ఉంది. అమెరికన్ ఎయిర్ లైన్స్ ప్రధాన కార్యాలయం ఇక్కడ ఉంది.

మూలాలు

[మార్చు]
  1. "American FactFinder". United States Census Bureau. Retrieved 2008-01-31.
  2. "US Board on Geographic Names". United States Geological Survey. 2007-10-25. Retrieved 2008-01-31.

ఇతర లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=డల్లాస్&oldid=4320392" నుండి వెలికితీశారు