గ్రంధి
Appearance
ఈ వ్యాసం శరీరంలో స్రవించే భాగాలు గురించి. ఇదే విధమైన ఇంటిపేరు కొరకు, గ్రంధి (ఇంటి పేరు) చూడండి.
గ్రంధి (Gland) అనగా మన శరీరంలో ఒకటి లేదా అధికంగా స్రావాలను ఉత్పత్తి చేసే భాగాలు. కొన్ని సందర్భాలలో ఒకే కణం ఈ పనిని నిర్వర్తించవచ్చును. కొన్ని అవయవాల గోడలలో ఇవి విరివిగా ఉంటాయి. ఇతర సందర్భాలలో ప్రత్యేకమైన అవయవాలు ఈ పనిని నిర్వర్తిస్తాయి. కొన్నింటిలో స్రావితమైన రసం గ్రంధి నుండి బయటకు పోవడానికి నాళాలుంటాయి. నాళాలు లేని సందర్భాలలో స్రావాలు సరాసరి రక్తంలోకి పంపబడతాయి. ఈ విధమైన గ్రంధులను 'వినాళ గ్రంధులు' అంటారు.
గ్రంధులలో రకాలు
[మార్చు]- వినాళ గ్రంధులు (Endocrine glands)
- జఠర గ్రంధులు (Gastric glands)
- లాలాజల గ్రంధులు (Salivary glands)
- పౌరుష గ్రంధులు (Prostatic glands)
- అశ్రు గ్రంధులు (Lachrymal glands)
- స్వేద గ్రంధులు (Sweat glands)
- బాల గ్రంధి (Thymus gland)
వ్యాధులు
[మార్చు]- ఎడినైటిస్ (Adenitis)
- ఎడినోమా (Adenoma)
- ఎడినో కార్సినోమా (Adenocarcinoma)
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- జంతుశాస్త్ర నిఘంటువు, తెలుగు అకాడమి, హైదరాబాదు.