Jump to content

return

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, విశేషణం, To Give back తిరిగీ యిచ్చుట.

  • he returned an answerప్రత్యుత్తరము చెప్పినాడు.
  • he struck it but it returned no sound దాన్ని తట్టినాడు గాని అది శబ్దించలేదు.
  • they returned railing for railing తిట్టినందుకు ప్రతితిట్టినారు.
  • the rock returned his cries వాడు అరిచిన దానికి కొండ ప్రతిధ్వని చేసినది.
  • he returned their salutation ప్రతి వందనము చేసినాడు.
  • he returned my thrust నేను పొడిచిన దానికి యెదురుగా పొడిచినాడు.
  • he returned my visit నేను వాడి దర్శనానికి పోయినందుకు ప్రతివాడు నా దర్శనానికి వచ్చినాడు.
  • he returned evil for good వుపకారమునకు ప్రతిగా అపకారమును చేసినాడు.
  • he returned evil for evil అపకారమునకు ప్రతి అపకారమును చేసినాడు.
  • return this to them దీన్ని వాండ్లకు మళ్లీ యిచ్చి వెయ్యి.
  • he returned (I will not come) నేను రానని ప్రత్యుత్తరము చెప్పినాడు.
  • I praised her childs beauty and she returned he complimentనేను దాని బిడ్డను పొగిడితే అది నా బిడ్డను పొగిడినది.
  • he set our ship on fire but we returned the compliment వాడు మా వాడను తగలబెట్టితే మేము వాడి వాడను తగలబెట్టినాము, మేమున్ను ప్రతికి ప్రతి చేసినాము.

క్రియ, నామవాచకం, to come or go back తిరిగీవచ్చుట, మళ్లీ పోవుట.

  • he returned home యింటికి పోయినాడు, దేశమునకు పోయినాడు.
  • he returned to the business మళ్లీఆ పనికి పూనుకొన్నాడు.
  • he returned to the subject తిరిగీ ప్రస్తాపము చేసినాడు.
  • when I returned to them నేను మళ్లీ వాండ్ల వద్దకి వచచినప్పుడు, పోయినప్పుడు.
  • when he returned to his senses వాడికి స్మారకము వచ్చేటప్పటికి.

నామవాచకం, s, తిరిగీ రావడము, తిరిగీ పోవడము.

  • after his return మళ్లీ వచ్చిన తర్వాత, తిరిగీ పోయిన తర్వాత.
  • before his return వాడు మళ్లీ రాక మునుపే.
  • I heard of his return వాడు మళ్లీ వచ్చినాడని విన్నాను.
  • this was the return they made for his kindness వాడు చేసిన వుపకారానికి వాండ్లు ప్రతిచేశినది యిది.
  • on their return home వాండ్లు దేశానికి వచ్చి చేరి నందు మీదట, యింటికి వచ్చి చేరినందుమీదట.
  • on his return from his journey వాడు పోయిన ప్రయాణము వచ్చి చేరిన తర్వాత.
  • they exported silks and the returns were cotton పట్టుబట్టలు పంపించి దానికిప్రతి నూలు బట్టలు తెప్పించుకొన్నారు.
  • the return of the fever మరకపాటు.
  • in return for his kindness వాడు చేశిన వుపకారమునకు ప్రతిగా.
  • a kind of account వొక విధమైన లెక్క.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=return&oldid=942735" నుండి వెలికితీశారు