1920
Jump to navigation
Jump to search
1920 గ్రెగోరియన్ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.
సంవత్సరాలు: | 1917 1918 1919 - 1920 - 1921 1922 1923 |
దశాబ్దాలు: | 1900లు 1910లు 1920లు 1930లు 1940లు |
శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
సంఘటనలు
[మార్చు]- జనవరి 10: నానాజాతి సమితిలో భారత్ సభ్యత్వం పొందింది.
- ఏప్రిల్ 20: 7వ ఒలింపిక్ క్రీడలు బెల్జియం లోని ఆంట్వెర్ప్లో ప్రారంభమయ్యాయి.
- అక్టోబర్ 17: భారతీయ కమ్యూనిస్టు పార్టీ (కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా) తాష్కెంట్లో ఏర్పడింది.
- అక్టోబర్ 20: సెన్సార్ బోర్డు తొలిసారిగా ఒక చిత్రానికి రీళ్ల సంఖ్య, నిడివిని పేర్కొంటూ సర్టిఫికెట్ జారీ చేసింది.
- నవంబర్ 5: భారతీయ రెడ్‌క్రాస్ ఏర్పడింది.
జననాలు
[మార్చు]- జనవరి 1: మహమ్మద్ రజబ్ అలీ, ఖమ్మం జిల్లా రాజకీయ నాయకుడు. (మ.1997)
- జనవరి 2: ఐజాక్ అసిమోవ్, అమెరికన్ రచయిత, బోస్టన్ విశ్వవిద్యాలయంలో జీవరసాయన శాస్త్రం ప్రొఫెసర్. (మ.1992)
- జనవరి 20: బి.విఠలాచార్య, తెలుగు, తమిళ, కన్నడ సినిమా దర్శకులు, నిర్మాత. (మ.1999)
- ఫిబ్రవరి 5: షేక్ నాజర్, బుర్రకథ పితామహుడు. (మ.1997)
- మార్చి 5: మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి, తెలుగు సాహిత్యంలో కవి. (మ. 1992)
- మార్చి 22: కట్సుకో సరుహషి జపాన్ దేశానికి చెందిన భూరసాయన శాస్త్రవేత్త. (మ.2007)
- ఏప్రిల్ 7: రవిశంకర్, భారతీయ సంగీత విద్వాంసుడు. (చ. 2012)
- మే 12: వింజమూరి అనసూయ, జానపద కళాకారిణి, సంగీత దర్శకురాలు, రచయిత.
- మే 17: శాంతకుమారి, అలనాటి తెలుగు సినిమా నటీమణి.
- జూన్ 11: మహేంద్ర, నేపాల్ రాజు.
- జూన్ 28: బొమ్మకంటి శ్రీనివాసాచార్యులు, తెలుగు రచయిత, సంపాదకులు, ఉపన్యాసకులు.
- జూలై 7: మద్దిపట్ల సూరి, రచయిత, అనువాదకుడు, సాహితీవేత్త. (మ.1995)
- జూలై 9: తమ్మారెడ్డి సత్యనారాయణ, భారత కమ్యూనిష్ఠు పార్టీ నేత. (మ.)
- జూలై 10: పీసపాటి నరసింహమూర్తి, రంగస్థల నటుడు. (మ.2007)
- జూలై 14: శంకర్రావు చవాన్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి.
- జూలై 15: డి.వి. నరసరాజు, రంగస్థల, సినిమా నటుడు, రచయిత, దర్శకుడు. (మ.2006)
- జూలై 15: కందాళ సుబ్రహ్మణ్య తిలక్, స్వాతంత్ర్యసమరయోధులు, లోక్‌సభ సభ్యులు.
- జూలై 18: నిర్మలమ్మ, తెలుగు సినిమా నటి. (మ. 2009)
- జూలై 18: ఆవుల జయప్రదాదేవి, మహిళా ప్రగతికి విశేషంగా కృషిచేసిన వ్యక్తి. (మ.2004)
- ఆగష్టు 16: కోట్ల విజయభాస్కరరెడ్డి, ఆంధ్రప్రదేశ్‌కు రెండుసార్లు ముఖ్యమంత్రి. (మ.2001)
- ఆగష్టు 18: హర్భజన్ సింగ్ పంజాబీ రచయిత, విమర్శకుడు, సాహిత్యకారుడు, అనువాదకుడు. (మ.2002)
- ఆగస్టు 20: రేమెళ్ళ సూర్యప్రకాశశాస్త్రి, ఆధ్యాత్మిక గురువులు, ఆధ్యాత్మిక గ్రంథ రచయితలు.
- ఆగస్టు 26: ఏల్చూరి సుబ్రహ్మణ్యం, కవి, రచయిత, పాత్రికేయుడు. (మ.1955)
- సెప్టెంబరు 10: కల్యంపూడి రాధాకృష్ణ రావు, గణిత శాస్త్రజ్ఞుడు, గణాంక శాస్త్రజ్ఞుడు.
- సెప్టెంబరు 25: సతీష్ ధావన్, భారతీయ ఏరోస్పేస్ ఇంజనీరు, ఇస్రో మాజీ ఛైర్మన్ (మ.2002)
- అక్టోబరు 4: తమ్మారెడ్డి గోపాలకృష్ణమూర్తి, హేతువాది, వామపక్షవాది. (మ.2013)
- అక్టోబరు 11: మావేలికార కృష్ణన్ కుట్టి నాయర్, మృదంగ విద్వాంసుడు. పద్మశ్రీ అవార్డు గ్రహీత. (మ.1988)
- అక్టోబరు 15: భూపతిరాజు విస్సంరాజు, సంఘ సేవకుడు, పద్మభూషణ అవార్డు గ్రహీత. (మ.2002)
- అక్టోబరు 17: షోయబుల్లాఖాన్, నిజాం విమోచన పోరాటయోధుడు, ఇమ్రోజ్ పత్రిక సంపాదకుడు.
- అక్టోబరు 27: కె.ఆర్. నారాయణన్, భారత రాస్ట్రపతి. (మ. 2005)
- సెప్టెంబరు 12: పెరుగు శివారెడ్డి, ఆంధ్రప్రదేశ్ లోని ఒక ప్రఖ్యాత నేత్రవైద్య నిపుణుడు. (మ.2005)
- అక్టోబరు 15: మారియోపుజో, 'గాడ్‌ఫాదర్' నవలతో ప్రపంచానికి మాఫియా గురించి తెలియజెప్పిన ఆంగ్ల నవలా రచయిత.
- అక్టోబర్ 17: షోయబ్ ఉల్లాఖాన్, తెలంగాణా సాయుధ పోరాట యోధుడు, బాహ్య ప్రపంచానికి అంతగా తెలియని త్యాగధనుడు, నిర్భయ జర్నలిస్ట్, మత దురహంకారానికి వ్యతిరేకి. (మ.1948)
- నవంబరు 5: డగ్లస్ నార్త్, ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత.
- నవంబరు 7: బొల్లిముంత శివరామకృష్ణ, అభ్యుదయ రచయిత, ప్రజా కళాకారుడు, హేతువాది. (మ.2005)
- నవంబరు 10: దత్తోపంత్ ఠెన్గడీ, హిందూత్వవాది, భారతీయ కార్మిక సంఘ నాయకుడు, భారతీయ మజ్దూర్ సంఘ్ వ్యవస్థాపకుడు. (మ.2004)
- నవంబరు 13: కె.జి.రామనాథన్, భారతీయ గణిత శాస్త్రవేత్త. (మ.1992)
- నవంబరు 17: జెమినీ గణేశన్, తమిళ నటుడు. (మ.2005)
- డిసెంబర్ 10: గంటి కృష్ణవేణమ్మ, తెలుగు కవయిత్రి.
- : ముక్కామల కృష్ణమూర్తి, తెలుగు సినిమా నటుడు,
మరణాలు
[మార్చు]- ఫిబ్రవరి 22: ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, బ్రిటిషు దుష్టపాలనపై ఎదిరించి తిరుగుబాటు చేసిన తెలుగు వీరుడు. (జ.1870)
- మే 7: హెచ్.వి.నంజుండయ్య,మైసూరు విశ్వవిద్యాలయం తొలి ఉపకులపతి, మైసూర్ రాజ్య దీవాన్, పరిపాలనాదక్షుడు, విద్యావేత్త (జ.1860)
- ఆగష్టు 1: బాలగంగాధర తిలక్, భారత జాతీయోద్యమ నాయకుడు. (జ.1856)
- సెప్టెంబరు 29: దీవి గోపాలాచార్యులు, వైద్య శాస్త్రవేత్త, హిందూ సంప్రదాయ వైద్య పరిశోధకులు. (జ.1872)