Jump to content

సుధ (నటి)

వికీపీడియా నుండి
సుధ
జననం
టి. హేమ సుధ

1964
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు1990's–ఇప్పటివరకు

సుధ ఒక ప్రముఖ సినీ నటి. 500 కి పైగా తెలుగు సినిమాలలో నటించింది.[1] ఆమె, గ్యాంగ్‌లీడర్‌, చాలా బాగుంది, అతడు, దూకుడు, బాద్‍షా లాంటి సినిమాలో మంచి పాత్రలు పోషించింది. తెలుగులో మహేష్ బాబు, జూనియర్‌ ఎంటీఆర్, అల్లు అర్జున్, తమిళంలో సూర్య, అజిత, విశాల్‌ వంటి హీరోలందరికీ తల్లి పాత్రలు చేసింది.[2]

జీవిత విశేషాలు

[మార్చు]

ఆమె పుట్టి పెరిగింది తమిళనాడులోని శ్రీరంగం. ఆమె తమిళురాలు అయినప్పటికీ అల్లు రామలింగయ్య సలహాతో తెలుగు బాగా నేర్చుకుని స్వంతంగా డబ్బింగ్ చెప్పుకుంటుంది. ఆమె కూతురు ఎంబీఏ పూర్తి చేసింది.[1]

కెరీర్

[మార్చు]

అలనాటి పౌరాణిక గాధను కమలాకర కామేశ్వరరావు తెరకెక్కించిన శ్రీ వినాయక విజయం ద్వారా బాలనటిగా పరిచయమైన సుధ తరువాత అనేక చిత్రాలలో నటించింది. ఆమె నటించిన ఒక నాటకానికి విసు, ఎస్వీ ముత్తురామన్‌, బాలచందర్‌ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. అక్కడ ఆమెను చూశాక సినిమాల్లో అవకాశం ఇచ్చారు. తమిళంలో మూడు చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది. ఆమె తొలి చిత్రం ఏవీఎం సంస్థ నిర్మించింది. దాన్ని ముత్తురామన్‌ తీశారు. రెండో చిత్రం బాలచందర్‌ దర్శకత్వం వహించింది. ఇది షూటింగ్‌ పూర్తవ్వడంతో తొలిచిత్రంకంటే ముందే విడుదల అయ్యింది. సినిమా మాత్రం ఆకట్టుకోలేదు. ఆమె కెరీర్‌కు ఏడాదిపాటు గ్యాప్‌ వచ్చింది. అప్పుడు బాలచందర్ ఆమెకు హీరోయిన్‌కు చెల్లి పాత్ర ఇచ్చి చేయాలా వద్దా అనేది ఆమెనే నిర్ణయించుకోమన్నాడు. వారం రోజులు టైమ్‌ ఇచ్చాడు. ఆమె కేవలం గంటలో నిర్ణయం తీసుకుని ఓకే చెప్పింది. అప్పటి నుంచి సహాయ నటి పాత్రలకుపరిమితమమైపోయింది. అన్ని భాషల్లో కలిపి ఏడొందల చిత్రాలు పూర్తి చేసింది.

తెలుగులో ఆమె తొలి చిత్రం తల్లిదండ్రులు. ఆ సినిమాకు తాతినేని రామారావు దర్శకుడు.[1]

నటించిన చిత్రాలు

[మార్చు]

2020లు

[మార్చు]

2010లు

[మార్చు]

2000లు

[మార్చు]

1990లు

[మార్చు]

1980లు

[మార్చు]

1970లు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 Mallemputi, Adhinarayana. "Interview with Sudha". andhrajyothy.com. Vemuri Radhakrishna. Archived from the original on 8 జూలై 2016. Retrieved 4 July 2016.
  2. Sakshi (23 January 2022). "దూరం పెట్టారు, మనుషుల్ని నమ్మకూడదని అర్థమైంది". Archived from the original on 23 జనవరి 2022. Retrieved 23 January 2022.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=సుధ_(నటి)&oldid=4345319" నుండి వెలికితీశారు