విష్ణువర్ధనుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

విష్ణువర్ధనుడు
Hoysala King
పరిపాలనసుమారు 1108 –  1152 CE
పూర్వాధికారిVeera Ballala I
ఉత్తరాధికారిNarasimha I
రాజవంశంHoysala
మతంHinduism (convert from Jainism)[1][2][3][4]
బేలూరు వద్ద వేసర నిర్మాణ శైలిలో విష్ణువర్ధనుడు నిర్మించిన చెన్నకేశ్వర ఆలయం
హొయశిల వద్ద కేతవర్మ, కేసరచెట్టి అనే సంపన్న వ్యాపారుల నిధిసహాయంతో నిర్మించబడి రాజు విష్ణువర్ధనుడు, రాణి శీతలాదేవిలకు అంకితం ఇవ్వబడిన హొయశిలేశ్వరుడి ఆలయం
రాణి శీతలాదేవి నిర్మించిన కప్పే చెన్నిగరాయ ఆలయం

విష్ణువర్ధనుడు (కన్నడ: ವಿಷ್ಣುವರ್ಧನ) (సా.శ. 1108–1152) హోయసల వంశానికి చెందిన ఒక రాజు. ఈ రాజ్యం ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలో ఉంది. ఈయన తన అన్న ఒకటవ వీర బల్లాల సా.శ. 1108 లో మరణించిన తరువాత సింహాసనాన్ని అధిష్టించాడు. మొదట్లో జైనమతాన్ని అనుసరించే వాడు. అప్పుడు ఆయనను బిత్తిదేవుడు అని పిలిచేవారు. తరువాత రామానుజాచార్యుల ప్రభావంతో హిందూ మతంలోకి మారి విష్ణువర్ధనుడనే పేరుతో చలామణి అయ్యాడు.[1][2][3][4] విష్ణు వర్ధనుడు దక్షిణ భారతదేశంలో స్వతంత్ర హోయసాల సామ్రాజ్యం స్థాపించడానికి తన చక్రవర్తి, పశ్చిమ చాళుక్య రాజైన నాలుగో విక్రమాదిత్యుడిపైనా, దక్షిణాన ఉన్న చోళ సామ్రాజ్యం పైన అనేక దండయాత్రలు చేశాడు. తలకాడు యుద్ధంలో చోళుల నుంచి గంగావతి (ప్రస్తుతం దక్షిణ కర్ణాటక) లోని కొన్ని ప్రాంతాలను, [5] నోలంబావడి లోని కొన్ని ప్రాంతాలను [6] తన రాజ్యంలో కలుపుకున్నాడు.

విష్ణువర్ధనుడి పరిపాలనలోనే హోయసాలుల కన్నడ సాహిత్యం బాగా వ్యాప్తి చెందింది. గణితవేత్తయైన రాజాదిత్యుడు వ్యవహార గణితం, లీలావతి అనే గణిత గ్రంథాలను రచించాడు. ఇ.పి. రైస్ అనే చరిత్రకారుని అభిప్రాయం ప్రకారం నాగచంద్ర అనే మహాకవి కన్నడంలో రామాయణం యొక్క విస్తృత రూపమైన రామచంద్ర చరిత పురాణం, జైన తీర్థంకరుడి పై మల్లినాథ పురాణం లాంటి రచనలు చేసినపుడు విష్ణువర్థనుని ఆస్థానంలోనే ఉన్నాడు.[7][8][9][10]

విజయాలు

[మార్చు]

దక్షిణ ప్రాంతాలలో యుద్ధాలు

[మార్చు]

విష్ణువర్ధన తన అన్నయ్య మొదటి వీర బల్లాలా పాలనలో గంగావాడిలోని కొన్ని ప్రాంతాలకు రాజప్రతినిధిగా ఉన్నారు. హొయసల సింహాసనాన్ని అధిరోహించిన తరువాత. ఆయన సి సా.శ..1116 లో గంగావాడి ఆక్రమిత చోళ భూభాగాలను స్వాధీనం చేసుకోవడం ఆయన మొదటి ప్రధాన విజయంగా భావించబడుతుంది. చరిత్రకారుడు కామతు అభిప్రాయం ఆధారంగా అసంతృప్తి చెందిన చోళ రాజప్రతినిధి అడిగైమాను విష్ణువర్ధనుడి ఆక్రమణలో సహాయం చేసి ఉండవచ్చు అని భావిస్తున్నారు. మతపరంగా వైష్ణవ హిందువు కావడంతో చోళ రాజప్రతినిధి పట్ల రాజు మొదటి కులోత్తుంగ చోళుడు ఆదరంగా ప్రవర్తించకుండా ఉండి ఉండవచ్చు.[11][12] కానీ శాస్త్రి విష్ణువర్ధనుడు తన మద్దతు పొందే ముందు అడిగైమానును తనవైపు సామర్ధ్యంగా తిప్పుకున్నాడని పేర్కొన్నాడు.[13] సి సా.శ..1117 నాటికి విష్ణువర్ధనుడు నీలగిరి ప్రాంతంలోని ఇతర పాలకులైన చెంగల్వాలు, కొంగల్వాలు, (చరిత్రకారుడు డెరెటు అభిప్రాయం ఆధారంగా కొంగల్వా యువరాణి చందలదేవిని వివాహం చేసుకున్నాడు), నిదుగళు చోళ పాలకుడు ఇరుక్కవేలాను ఓడించాడు. కామతు అభిప్రాయం ఆధారంగా విష్ణువర్ధనుడి దళాలు కంచి వరకు వెళ్ళాయి. నోలంబవాడి నోలంబాలు, బనావాసి, గోవా కడంబాలు (రెండవ జయకేసి పాలన), ఉచ్చంగి పాండ్యాలు (తుంగభద్ర సమీపంలో పాలకుల చిన్న రాజవంశం), తులునాడు అలుపాలు, హోసగుండ సంతారాలు కప్పం అర్పించి విష్ణువర్ధనుడి ఆధిపత్యాన్ని అంగీకరించవలసిన పరిస్థితి ఎదురైంది.[13][14][15] ఈ కాలానికి చెందిన హొయసల శాసనాలు విష్ణువర్ధనుడు నీలగిరిని జయించడాన్ని గమనించవచ్చు. చమరాజనగర శాసనం ఆయన సైన్యాలు నీలా పర్వతాలను దాటిన ఆయనను "కేరళ మాస్టరు"గా ప్రకటిస్తున్న వివరాలను ఇస్తుంది. చరిత్రకారులు చోప్రా, రవీంద్రను, సుబ్రమణియన్ల అభిప్రాయం ఆధారంగా చోళుల మీద విజయం సాధించిన తరువాత కాంచీలో తాత్కాలికంగా గడిపినట్లు ఇతర నమోదిత వ్రాతపూర్వక ఆధారాలు పేర్కొన్నాయి. చోళ సామ్రాజ్యానికి అంతరాయం కలిగించడానికి విష్ణువర్ధనుడు కూడా కొంత కారణంగా ఉన్నాడు.[16] ఈ విజయాలతో విష్ణువర్ధనుడు తలకాడుకొండ ("లార్డు ఆఫ్ తలాకాడు), నోలంబవాడి గోండా (" లార్డు ఆఫ్ ది నోలంబాసు ") అనే బిరుదులను స్వీకరించారు.[17]

కల్యాణి చాళుక్యులతో యుద్ధాలు

[మార్చు]

దక్షిణాదిలో అతని విజయాల తరువాత విష్ణువర్ధన తన అధిపతి, గొప్ప పశ్చిమ చాళుక్య రాజు 6 వ విక్రమాదిత్య నుండి విముక్తి పొందాలనే ఉద్దేశ్యంతో వేగంగా ఉత్తరం వైపు తిరిగాడు. C.క్రీ.పూ 1117 - c.1120 మధ్య, విష్ణువర్ధనుడు కన్నెగళ (c.క్రీ.పూ.1118) వద్ద చాళుక్య సైన్యాలతో విజయవంతంగా వ్యవహరించాడు. హనగలు వద్ద ఒక వ్యూహాత్మక కోటను ఆక్రమించాడు. హాలూరు (c.క్రీ.పూ1120) వద్ద చాళుక్య సైనికాధికారి బొప్పన్నను ఓడించాడు. బనావాసి, హుమాచా ప్రాంతాల మీద తన నియంత్రణను విస్తరించాడు. C.క్రీ.పూ.1122 నాటికి ఆయన కృష్ణ నదికి చేరుకున్నాడు. ఇక్కడ ఆయన చాళుక్య చక్రవర్తికి విధేయుడైన సైనికాధికారి అయిన శక్తివంతమైన సిండా అధిపతి అచుగి చేతిలో ఓడిపోయాడు. విష్ణువర్ధనుడి ప్రస్తుతానికి చాళుక్య సింహాసనానికి లొంగిపోవలసిన అవసరం ఏర్పడింది. [14][18] కానీ ఆయన ఎక్కువ కాలం చాళుక్యులకు లొంగి ఉండలేదు. ఆరవ వికార్మాదిత్య మరణం తరువాత హొయసల చక్రవర్తి హనగలు, ఉచ్చాంగి, బంకాపురాలను c.సా.శ.1140 నాటికి తిరిగి స్వాధీనం చేసుకుని తుంగభద్ర నదికి ఉత్తరాన లక్కుండి వరకు వెళ్ళాడు.[14][19] చరిత్రకారుడు మజుందారు కృష్ణ నది ప్రాంతంలో విష్ణువర్ధనుడి నియంత్రిత ప్రాంతాలను c.సా.శ.1131 లో కూడా పేర్కొన్నాడు. చాళుక్యులకు నామమాత్రంగా లొంగి ఉన్నప్పటికీ సార్వభౌమత్వానికి చిహ్నంగా ప్రతిష్టాత్మక " తులపురుష " వేడుకను ప్రదర్శించాడు.[20] విష్ణువర్ధనుడి మరణించిన సంవత్సరంలో చరిత్రకారులు విభజించబడ్డారు. శాస్త్రి, ఎస్.కె. అయ్యంగారు, దేశాయి విష్ణువర్ధనుడు సి. సా.శ. 1152 లో మరణించారని అభిప్రాయపడ్డారు. సి. సా.శ. 1145 యల్లాదహల్లి వ్రాతపూర్వక ఆధారాలు తన కుమారుడు మొదటి నరసింహ హొయసల చక్రవర్తిగా ప్రకటించినందున విష్ణువర్ధనుడు కొద్దిసేపటి క్రితం మరణించినట్లు ఆధారాలు ఉన్నాయని కామతు పేర్కొన్నాడు.[14]

నిర్మాణకళా వారసత్వం

[మార్చు]

విష్ణువర్ధనుడు నిర్మాణకళాకారుడు. చోళులకు వ్యతిరేకంగా తన విజయోత్సవాన్ని జరుపుకునేందుకు ఆయన తలాకాడు వద్ద కీర్తి నారాయణ ఆలయాన్ని బేలూరు వద్ద అద్భుతమైన విజయనారాయణ ఆలయాన్ని (చెన్నకేశవ ఆలయం అని కూడా పిలుస్తారు, దీనిని హిందూ దేవుడు విష్ణువుకు అంకితం చేశారు) నిర్మించారు.[11] అదే సమయంలో బేలూరు వద్ద ఉన్న ఆలయం కంటే ఎక్కువ అలంకరించబడిన, హిందూ దేవుడు శివుడికి అంకితం చేయబడిన హొయసలేశ్వర ఆలయం పవిత్రం చేయబడింది.[21][22] బేలూరు, హలేబీడు దేవాలయాలు ప్రతిపాదిత యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా గుర్తించబడ్డాయి. [23] చెన్నకేశవ ఆలయ సముదాయంలో విష్ణువర్ధనుడి ప్రసిద్ధ రాణి శాంతలాదేవి నిర్మించిన చిన్న ఇంకా అలంకరించబడిన కప్పే చెన్నిగరయ ఆలయం ఉంది. [24]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 Alkandavilli Govindāchārya (1906), p.180
  2. 2.0 2.1 Stein, Burton (1989), p.16, The New Cambridge History of India: Vijayanagara, Cambridge University Press, ISBN 0 521 266 939
  3. 3.0 3.1 Menon, Indira (2013), p.127, RHYTHMS IN STONE, The Temples of South India, Ambi Knowledge Resource
  4. 4.0 4.1 Smith, Vincent Aurthur (1920), p.203, The Oxford History of India: From the Earliest Times to the End of 1911, Clarendon Press
  5. Sen (1999), pp.386-387, p.485
  6. Sen (2013), pp.58-60
  7. T. K. Venkataraman (1968), p.163, Indian culture, University of Madras, Amudha Nilayam, OCLC 599885676
  8. Karnataka through the ages: from prehistoric times to the day of the independence of India, Literary and Cultural Development Dept, Government of Mysore, 1968, p.466
  9. Kamath (1980), p.133
  10. E.P. Rice in Sisir Kumar Das (2005), p.144, A History of Indian Literature, 500-1399: From Courtly to the Popular, Sahitya Akademi, ISBN 81-260-2171-3
  11. 11.0 11.1 Kamath (1980), p.124
  12. Sen (1999), p.485
  13. 13.0 13.1 Sastri (1955), p.174
  14. 14.0 14.1 14.2 14.3 Kamath (1980), p.125
  15. Chopra, Ravindran and Subrahmanian (2003), p.152-153
  16. Chopra, Ravindran and Subrahmanian (2003), p.153
  17. Kamath (1980), pp.124-125
  18. Chopra, Ravindran and Subrahmanian (2003), pp.153-154
  19. Sen (1999), p.387
  20. Majumdar R.C (1977), p.410
  21. Professor S. Settar. "Hoysala Heritage". Frontline, Volume 20 - Issue 08, April 12–25, 2003. Frontline, From the publishers of the Hindu. Retrieved 22 నవంబరు 2006.
  22. Foekema (1996) p.14
  23. "Sacred Ensembles of the Hoysala - Tentative Lists". UNESCO. World Heritage Centre, Paris, France. జూలై 2014. Retrieved 4 సెప్టెంబరు 2014.
  24. Jyotsna Chatterji, (1990), p.91, Religions and the status of women, Uppal Publishing House for William Carey Study and Research Centre, Calcutta