మొరేనా
మొరేనా
మురైనా | |
---|---|
పట్టణం | |
Nickname: మయూర్‌వన్ | |
Coordinates: 26°30′N 78°00′E / 26.5°N 78.0°E | |
దేశం | India |
రాష్ట్రం | మధ్య ప్రదేశ్ |
జిల్లా | మొరేనా |
విస్తీర్ణం | |
• Total | 80 కి.మీ2 (30 చ. మై) |
Elevation | 177 మీ (581 అ.) |
జనాభా (2011)[1] | |
• Total | 2,00,483 |
• Rank | 154 |
• జనసాంద్రత | 2,500/కి.మీ2 (6,500/చ. మై.) |
భాషలు | |
• అధికారిక | హిందీ |
Time zone | UTC+5:30 (IST) |
PIN | 476001 |
టెలిఫోన్ కోడ్ | 07532 |
Vehicle registration | MP-06 |
మొరేనా మధ్య ప్రదేశ్ రాష్ట్రం, మొరేనా జిల్లా లోని పట్తణం, ఈ జిల్లా ముఖ్యపట్తణం. ఇది మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ నుండి 39 కి.మీ.దూరంలో ఉంది. మొరేనా ఒకప్పుడు పెద్ద సంఖ్యలో బందిపోట్ల వలన భయభ్రాంతులకు గురైంది. బింద్, మొరేనాకు పొరుగున ఉన్న పట్టణం. మొరేనా పారిశ్రామిక కేంద్రం. కానీ ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా వ్యవసాయం మీద ఆధారపడుతుంది. మొరేనాలో అనేక తయారీ పరిశ్రమలు ఉన్నాయి.
భౌగోళికం
[మార్చు]మొరేనా 26°30′N 78°00′E / 26.5°N 78.0°E నిర్దేశాంకాల వద్ద, [2] సముద్ర మట్టం నుండి 177 మీటర్ల ఎత్తున ఉంది.
ఇక్కడి నుండి రైలు మార్గం, జాతీయ రహదారి ద్వారా గ్వాలియర్, ఆగ్రాతో సంబంధాలున్నాయి. నూనెగింజల మిల్లింగ్, పత్తి నేయడం ఇక్కడి ప్రధాన పరిశ్రమలు. నగరంలో జివాజీ విశ్వవిద్యాలయంతో అనుబంధంగా మూడు కళాశాలలు, ఆర్జీపీవీ విశ్వవిద్యాలయంతో అనుబంధంగా రెండు కళాశాలలు ఉన్నాయి.
గోధుమలు, నూనె గింజలు ఇక్కడి ప్రధాన పంటలు. నిర్మాణ రాయి క్వారీలకు ఈ ప్రాంతం ప్రసిద్ధి మొరేనా నెమళ్లకు ప్రసిద్ధి చెందింది (2001 లో 1,50,959). అందువలన పురాతన కాలంలో ఈ ప్రాంతాన్ని మయూర్ వన్ అని కూడా పిలిచేవారు.
జనాభా
[మార్చు]2011 జనాభా లెక్కల ప్రకారం, మొరేనా జనాభా 2,88,303. జనాభాలో 13.2% మంది ఆరేళ్ళ లోపు పిల్లలు. అక్షరాస్యత 80.28%; పురుషుల అక్షరాస్యత 89.08%, స్త్రీల అక్షరాస్యత 70.22%.
రవాణా సౌకర్యాలు
[మార్చు]రోడ్లు
[మార్చు]మొరేనా జాతీయ రహదారి 3 పై ఉంది . ఈ రహదారి ద్వారా మొరేనా నుండి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు, సమీప రాష్ట్రాలైన రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్‌లకు రోడ్డు సౌకర్యం కలిగింది. సమీప పట్టణాలు, గ్రామాలు, నగరాలకు బస్సు సేవలు ఉన్నాయి. మొరేనా నుండి ఆగ్రా, ఢిల్లీ, గ్వాలియర్, ఇండోర్, ముంబై, భోపాల్ వంటి నగరాలకు బస్సులు నడుస్తాయి.
భారత రైల్వే
[మార్చు]మొరేనా రైల్వే స్టేషన్ నుండి ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, చెన్నై, పూణే, జైపూర్, ఇండోర్ తదితర ప్రధాన నగరాలతో సహా దేశంలోని అన్ని ప్రాంతాలకు రైళ్ళున్నాయి. భోపాల్ ఎక్స్‌ప్రెస్, తాజ్ ఎక్స్‌ప్రెస్, భోపాల్ శతాబ్ది వంటి ఎక్స్‌ప్రెస్ రైళ్లతో సహా, ఇంకా ఇతర రైళ్ళు మొరేనా వద్ద ఆగుతాయి.
మూలాలు
[మార్చు]- ↑ "Census of India Search details". censusindia.gov.in. Retrieved 10 May 2015.
- ↑ "Maps, Weather, and Airports for Morena, India".