Jump to content

శానోజే

వికీపీడియా నుండి

శానోజే, అధికారికంగా శానోజే నగరం (అంటే స్పనభాషలో 'సెయింటు యోసీపు'; ఆంగ్లం: City of San José /ˌsæn hˈz, -ˈs/; స్పనభాష: [saŋ xoˈse]),[1] ఉత్తర కాలిఫోర్నియాలో జనసంఖ్య, అలాగే ప్రాంతం పట్టి అతిపెద్ద నగరం. 2020లో 10,13,240 జనసంఖ్య[2] తో అది 2015లో 77 లక్షల జనసంఖ్యవున్న[3] అఖాత ప్రాంతం (బే ఏరియా)లోనూ అదే సంవత్సరంలో 97 లక్షల జనసంఖ్యవున్న[4] శాంఫ్రాన్సిస్కో-శానోజే-ఓక్లాండు కూడిన సాంఖ్యక ప్రాంతం (కంబైండ్ స్టాటిస్టికల్ ఏరియా)లోనూ అతిపెద్ద జనసంఖ్యవున్న నగరం, కాలిఫోర్నియాలో లాసేంజలెసు, శాండియాగో తర్వాత మూడవ అతిపెద్ద నగరం, అలాగే సంయుక్త రాష్ట్రాల్లో 12వ అతిపెద్దది.[5][6] శాంటా క్లారా లోయ మధ్యలో, శాంఫ్రాన్సిస్కో అఖాతానికి దక్షిణ తీరంలో ఉన్న శానోజేలో 466.1 కిమీ2 ప్రాంతం వస్తుంది. శానోజే శాంటా క్లారా కౌంటీకి కౌంటీ సీటూ 2018లో దాదాపు 20 లక్షల జనసంఖ్యవున్న శానోజే-సన్నీవేలు-శాంటా క్లారా మహానగర సాంఖ్యక ప్రాంతం (మెట్రోపాలిటన్ స్టటిస్టికల్ ఏరియా)లో ప్రధాన భాగం.[7]

శానోజే దాని కొత్తకల్పన, సాంస్కృతిక భిన్నత్వం[8], సంపన్నం, ఎండగల తేలిక మధ్యధరా వాతావరణం కోసం గుర్తింపు పొందుతుంది.[9] సిలికాన్వ్యాలి అనే అభివృద్ధిచెందుతున్న ఉన్నత సంకేతిక పరిశ్రమ[10] ఉత్పాతంవలన 1989లో నగరాన్ని ప్రోత్సాహించడానికి నగరాధ్యక్షుడు టాం మెకెనెరి "సిలికాన్వ్యాలి రాజధాని" అనే నగర నినాదం స్వీకరించాడు.[11] సిస్కో సిస్టెమ్స్, ఈబే, అడోబీ ఇంక్, పేపాల్, బ్రాడ్కాం, శామ్సంగ్, ఏసర్, జూం లాంటి ప్రపంచ సాంకేతిక సంస్థలు శానోజేలో ప్రధాన కార్యాలయాలు పెట్టుకుంటారు. మూడవ అతిపెద్ద తలసరి స్థూలదేశీయోత్పత్తి (జ్యూరికు, ఓస్లో తర్వాత)[12], ఐదవ అతిఖర్చైన ఇళ్ళ గిరాకి[13] తో శానోజే ప్రపంచ ప్రధాన నగరాల్లో అతిభాగ్యమైనవాటిల్లో ఒకటి. అక్కడ విదేశంలోని వియత్నామీ జనాభాల్లో అతిపెద్దవాటిల్లో ఒకటుంది, నగర నివాసుల్లో 40% కంటే ఎక్కువ వాళ్ళ హిస్పానిక సమూహం[14], ఇంకా జపాంటౌ, లిటల్పోర్చుగల్ లాంటి చారిత్రక జాతుల భాగాలున్నాయి.

స్పనవారు రావకముందు, శానోజే దగ్గర ప్రాంతాలు అనేక సంవత్సరాలు ఓలోనీ జాతుల తామ్యెన్వారుండే చోటు. Pueblo de San José de Guadalupe గా శానోజే స్థాపన 1777, నవంబరు 29న జరిగింది, కాలిఫోర్నియాల్లో స్థాపించిన మొదటి నగరం.[15] 1821లో మెక్సికో స్వాతంత్ర యుద్ధం తర్వాత మెక్సికోలో భాగంగా అయింది.

మెక్సికో-అమేరికా యుద్ధంలో అమెరికా కాలిఫోర్నియాను గెలిచాక, ఆ ప్రాంతం సంయుక్త రాష్ట్రాల్లోకు 1848లో వచ్చింది. దాని తర్వాత రెండు ఏళ్ళల్లో కాలిఫోర్నియా రాష్ట్రం అయ్యాక, శానోజేకు మొదటి రాష్ట్ర రాజధానిగా పేరు వచ్చింది.[16] 2వ ప్రపంచ యుద్ధం తర్వాత శానోజేలో ఆర్థిక విజృంభణ, జనసంఖ్య వేగంగా పెరగడమూ 1950-1970 కాలంలో దగ్గరున్న నగరాలనూ సమూహాలనూ బలంగా చేర్చుకోవడం జరిగాయి. ఉన్నత సాంకేతిక, విద్యుత్కనశాస్త్ర పరిశ్రమలు వేగంగా పెరిగినందుకు వ్యవసాయ కేంద్రం నుండి పట్టణ మహానగర ప్రాంతానికి మారుట ఇంకా త్వరగా అయింది. 1990 సంయుక్త రాష్ట్రాల జనగణన ఫలితాలేమో శానోజే శాంఫ్రాన్సిస్కోను దాటి ఉత్తర కాలిఫోర్నియాలో అతిజనాభాగల నగరమైందని చూపిచ్చింది.[17] 1990-2000 కాలానికి శానోజే ఉన్నత సాంకేతికానికీ అంతర్జాల పరిశ్రమలకూ ప్రపంచ కేంద్రం అయ్యి, అలాగే కాలిఫోర్నియాలో అతివేగంగా పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థమైంది.[18]

మూలాలు

[మార్చు]
  1. ఒక్కటే ఉన్నప్పుడు, San ఉచ్చారణ [san].
  2. "QuickFacts: San Jose city, California". United States Census Bureau. Archived from the original on 13 June 2022. Retrieved 20 August 2021.
  3. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; CensusBundle అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  4. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; CensusBundle2 అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  5. "U.S. Census website". U.S. Census Bureau. Archived from the original on August 7, 2022. Retrieved December 3, 2019.
  6. "San Jose no longer in Top 10 of most populous U.S. cities". The Mercury News (in అమెరికన్ ఇంగ్లీష్). 2023-05-18. Retrieved 2023-05-20.
  7. "Annual Estimates of the Resident Population: April 1, 2010 to July 1, 2018". United States Census Bureau, Population Division. April 2019. Archived from the original on February 13, 2020. Retrieved May 30, 2019.
  8. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; DiversityBundle2 అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  9. Kettmann, Steve (November 4, 2005). "36 Hours in San Jose, Calif". The New York Times. Archived from the original on March 26, 2022. Retrieved March 26, 2022.
  10. "Where is Silicon Valley?". Silicon Valley Historical Association (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on July 4, 2020. Retrieved 2021-03-08.
  11. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; CapitalBundle2 అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  12. "Silicon Valley Business Journal – San Jose Area has World's Third-Highest GDP Per Capita, Brookings Says". Archived from the original on March 9, 2017. Retrieved March 8, 2017.
  13. Millington, Alison. "The 10 most expensive cities to live in around the world in 2017". Business Insider. Archived from the original on March 26, 2022. Retrieved March 26, 2022.
  14. Gary, Jesse (September 20, 2021). "Combatting a decades-old Silicon Valley problem: Inclusivity amongst Hispanic populations". KTVU FOX 2. Archived from the original on March 26, 2022. Retrieved March 26, 2022.
  15. "The First City". California History Online. Archived from the original on February 18, 2008. Retrieved March 15, 2008.
  16. "California Admission Day—September 9, 1850". California State Parks. 2007. Archived from the original on March 28, 2016. Retrieved March 15, 2008.
  17. "1990 and 1980 Census Counts for Cities with 1990 Population Greater Than 100,000". United States Census Bureau. Archived from the original on June 29, 2014. Retrieved August 8, 2014. 1980: San Francisco = 678974, San Jose = 629400. 1990: San Jose = 782248, San Francisco = 723959
  18. "Silicon Valley Business Journal – San Jose has the Fastest-Growing Economy in California". Archived from the original on August 19, 2018. Retrieved September 27, 2017.
"https://te.wikipedia.org/w/index.php?title=శానోజే&oldid=3935771" నుండి వెలికితీశారు