Jump to content

ఇంధనం

వికీపీడియా నుండి
కలప, లేదా వంటచెరకు, ప్రపంచంలో అనేక యుగాలుగా మానవునిచే వుపయోగింపబడే ప్రాథమిక శక్తి వనరు.

మండించినపుడు శక్తిని ఉత్పత్తి చేయు పదార్ధాన్ని ఇంధనం (ఆంగ్లం: Fuel) అని అంటారు. వాహనాలు నడవడానికి, విద్యుత్ ఉత్పత్తి చేయడానికి, వంట చేయడానికి ఉపయోగపడును. ఇంధనాన్ని పొదుపు చేయాల్సిన ఆవశ్యకతపై ప్రజల్లో అవగాహన కలిగించడానికి ప్రతి సంవత్సరం డిసెంబరు 14న జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం జరుపుకుంటారు.[1][2]

ఇది రెండు రకాలు.

  1. కర్బన ఇంధనం
  2. అకర్బన ఇంధనం

కర్బన ఇంధనాలు

[మార్చు]

వీటినే ఆర్గానిక్ ఇంధనాలు: (Organic Compounds) అని కూడా అంటారు.ఇందులో కర్బన పదార్ధం (Carbon Compound) ఉండును. వీటిలో చాలా వరకు పెట్రోలియం ఉత్పత్తులే.

కర్బన ఇంధనాలకు ఉదాహరణలు :

  1. రాకాసి బొగ్గు - దీనిని బొగ్గు గనులు నుండి వెలికితీస్తారు. విద్యుత్ ఉత్పత్తి కోసం, రైలు నడవడం కోసం వాడతారు.
  2. కలప - వృక్షం యొక్క కాండపు భాగం.దీనిని వంట చెరకుగా వాడతారు. పంచదార మిల్లులో చెరుకు పిప్పిను ఇంధనంగా వాడతారు.
  3. సాధారణ బొగ్గు - కట్టెను పాక్షికంగా కాల్చితే ఇది వస్తుంది.
  4. పెట్రోలు - దీనినే శిలాజ ఇంధనం అని కూడా అంటారు.
  5. డీజీల్
  6. కిరోసిన్
  7. నాఫ్తా
  8. ఏవియేషన్ టర్బైన్ ఫుయెల్ (Aviation Turbine Fuel) (A.T.F) - విమానాలు, హెలికాప్టర్ లలో వాడతారు.
  9. వంట గ్యాస్ - దీనిలో బ్యూటేన్ అనే వాయువు ఉండును.
  10. వెల్డింగ్ గ్యాస్ - దీనిలో అసిటలీన్ అనే వాయువు ఉండును. లోహాలు అతికించడానికి వాడతారు.
  11. జీవ ఇంధనం (బయో డీజీల్) - మొక్కల నుండి తయారుఛేస్తారు.
  12. ఆల్కహాల్ (సారాయి)- ప్రయోగశాలలో రసాయనాలను వేడిచేయడానికి సారాయి దీపంలో ఊయోగిస్తారు.
  13. కర్పూరం - హిందువుల పూజలలో హారతిగా వాడతారు. తిరుపతి లడ్డులో ఇది ఒక ముఖ్యమైన పదార్ధం. పార్టీలలో వంటకాలను వేడిగా ఉంచుటకు వంట పాత్రల క్రింద మండుతున్న కర్పూరం ఉంచుతారు.

అకర్బన ఇంధనాలు

[మార్చు]

వీటిలో కార్బన పదార్థం (Carbon) ఉండదు.

అకర్బన ఇంధనాలకు ఉదాహరణలు :

బాయిలరులలో నీటిని ఆవిరిగా మార్చుటకు ఇంధనాలను వాడతారు.బాయిలర్లలో పలురకాలు కలవు ఓడల్లో ఎక్కువగా కొక్రేన్ బాయిలరును ఉపయోగిస్తారు.అలాగే లాంకషైర్ బాయిలరులోకూడా బొగ్గును ఇంధనంగా ఉపయోగిస్తారు.

ఇవి కూడా చదవండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. ప్రజాశక్తి, ఎడిఓరియల్ (14 December 2019). "ఇంధనాల పొదుపు-పర్యావరణ పరిరక్షణ". www.prajasakti.com. జె.వి రత్నం. Archived from the original on 14 December 2019. Retrieved 14 December 2019.
  2. ఈనాడు, జిల్లాలు (14 December 2019). "పొదుపు చేద్దాం ఇంధనాన్ని". www.eenadu.net (in ఇంగ్లీష్). Archived from the original on 14 డిసెంబరు 2019. Retrieved 14 December 2019.

వెలుపలి లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=ఇంధనం&oldid=3797292" నుండి వెలికితీశారు