Jump to content

మొదటి పేజీ

వికీపీడియా నుండి
వికీపీడియా ఎవరైనా రాయదగిన స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వము.
ఇక్కడ సమాచారాన్ని వాడుకోవటమే కాదు, ఉన్న సమాచారంలో అవసరమైన మార్పుచేర్పులు చెయ్యవచ్చు, కొత్త సమాచారాన్ని చేర్చవచ్చు.
ప్రస్తుతం తెలుగు వికీపీడియాలో 1,13,150 వ్యాసాలున్నాయి. పూర్తి గణాంకాలు చూడండి.
పరిచయం అన్వేషణ కూర్చడం ప్రశ్నలు సహాయము తెలుగు టైపుచేయుట

విహరణ విశేష వ్యాసాలు అ–ఱ సూచీ

ఈ వారపు వ్యాసం
టెన్సింగ్ నార్కే

టెన్సింగ్ నార్కే (జ.మే 29, 1914 - మే 9, 1986) నేపాల్ కి చెందిన ఒక పర్వతారోహకుడు. అతను ప్రపంచంలో ఎత్తైన శిఖరం ఎవరెస్టు ను అధిరోహించిన మొదటి వ్యక్తులలో ఒకడు. అతను అతని సహచరుడు అయిన ఎడ్మండ్ హిల్లరీతో కలసి ఎవరెస్టు శిఖరాన్ని 1953 మే 29న అధిరోహించి చరిత్రలో మొదటి వ్యక్తిగా నిలిచాడు. టైమ్‌ మ్యాగజిన్ ప్రచురించిన 20వ శతాబ్దంలో ప్రపంచ ప్రాచుర్యం పొందిన 100 మంది ప్రముఖులలో ఒకరిగా పేరు పొందాడు. 1953లో నేపాల్ రాజు త్రిభువన్ ఆర్డర్ ఆఫ్ ది స్టార్ పురస్కారాన్ని ప్రకటించాడు. 1959లో అతనికి భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రదానం చేసింది. అతను బాల్య విశేషాల గురించి పరస్పర విరుద్ధమైన అంశాలున్నాయి. అతను కొద్ది సంవత్సరాల క్రిందట తెలిపిన స్వీయ చరిత్ర ఆధారంగా అతను తన కుటుంబం షెర్ఫా తెగకు చెందినదనీ, నేపాల్లో గల ఉత్తర హిమాలయ ప్రాంతంలోని "కుంబూ"లో గల "టెంగ్‌బోఖె" గ్రామానికి చేరుకున్నారనీ తెలిపాడు. "కుంబూ" ప్రాంతం ఎవరెస్టు శిఖరానికి దగ్గరగా ఉన్న ప్రాంతం. ఈ ప్రాంతాన్ని "టిబెటన్లు, షెర్ఫా"లు "ఖోమొలుంగ్మా" అని పిలుస్తారు. ఈ పదానికి టిబెట్ భాషలో "హోలీ మదర్" అని అర్థం. అతడు బౌద్ధమతస్తుడు. ఆ ప్రాంతములో గల "టిబెటన్లు, షెర్ఫా"లు బౌద్ధ మతస్తులే. అతని అసలైన పుట్టిన తేదీ గురించి ఖచ్చితంగా తెలియరాలేదు. ఆయన చెప్పినదానిని బట్టి మే నెల చివరిలో ఉండెడిదని తెలుస్తుంది. ఎవరెస్టు శిఖరం ఎక్కిన తదుపరి అతను తన పుట్టినతేదీని మే 29న జరుపుకొనేవాడు.
(ఇంకా…)

మీకు తెలుసా?

వికీపీడియా లోని కొత్త వ్యాసాల నుండి

  • ... పుట్టణ్ణ కణగాల్ అత్యంత ప్రభావవంతమైన భారతీయ చలనచిత్ర నిర్మాతల్లో ఒకడిగా పరిగణించబడ్డాడనీ!
  • ... కర్నూలు జిల్లాలోని కైరుప్పల గ్రామంలో ప్రతి యేటా పిడకల యుద్ధం జరుగుతుందనీ!
  • ... ఓస్లో విశ్వవిద్యాలయం నార్వే దేశంలో అత్యంత ప్రాచీనమైన విశ్వవిద్యాలయమనీ!
  • ... 1929 నుంచి 1939 మధ్యలో ప్రపంచ వ్యాప్తంగా మహా మాంద్యం ఏర్పడిందనీ!
  • ... గౌర్ బ్రాహ్మణులు వింధ్య పర్వతాలకు ఉత్తరాన నివసించే ఐదు పంచ గౌడ బ్రాహ్మణ సమాజాలలో ఒకటనీ!
చరిత్రలో ఈ రోజు
మే 29:
ఈ వారపు బొమ్మ
మహారాష్ట్రలోని ఖుల్దాబాద్ లో ఉన్న భద్ర మారుతి ఆలయం లో నిద్రిస్తున్న భంగిమలో ఉన్న హనుమంతుడు.

మహారాష్ట్రలోని ఖుల్దాబాద్ లో ఉన్న భద్ర మారుతి ఆలయం లో నిద్రిస్తున్న భంగిమలో ఉన్న హనుమంతుడు.

ఫోటో సౌజన్యం: కె.వెంకటరమణ
మార్గదర్శి
ఆంధ్రప్రదేశ్
భారతదేశం
విజ్ఞానం , సాంకేతికం
భాష , సమాజం
తెలంగాణ
ప్రపంచం
క‌ళలు , ఆటలు
విశేష వ్యాసాలు


సోదర ప్రాజెక్టులు
కామన్స్ 
ఉమ్మడి వనరులు 
వికీసోర్స్ 
మూలాలు 
వికీడేటా 
వికీడేటా 
వికీబుక్స్ 
పాఠ్యపుస్తకాలు 
విక్షనరీ 
శబ్దకోశం 
వికీకోట్ 
వ్యాఖ్యలు 
మెటా-వికీ 
ప్రాజెక్టుల సమన్వయం 
ఈ విజ్ఞానసర్వస్వం గానీ, దీని సోదర ప్రాజెక్టులు గానీ మీకు ఉపయోగకర మనిపించినట్లయితే, దయచేసి వికీమీడియా ఫౌండేషన్‌కు సహాయం చెయ్యండి. మీ విరాళాలు ప్రాథమికంగా సర్వర్ సామాగ్రి కొనుగోలు చేయటానికి, వికీ ప్రాజెక్టులపై అవగాహన పెంపొందించడానికీ ఉపయోగిస్తారు.